CI Over action: సిఐ ఓవరాక్షన్.. రోడ్డు మీద జనం ముందు మహిళను ఈడ్చుకెళ్తూ..! వీడియో..

|

Oct 08, 2022 | 9:17 AM

శ్రీకాళహస్తి ఆలయం ముందుండే వీధి వ్యాపారులపై దాడి చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారీ సర్కిల్ ఇన్ స్పెక్టర్. ఎమ్మెల్యే మధుసూదన్ కూతురుతోనూ రేణిగుంట


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ ఓవరాక్షన్ వల్ల.. ఒక మహిళకు తీవ్ర అవమానం జరిగింది. శ్రీరామ్ నగర్ కాలనీ మెయిన్ రోడ్డులో హోటల్ నిర్వహిస్తున్న ధనలక్ష్మి అనే మహళపై సీఐ దురుసుగా ప్రవర్శించారు. సీఐ అత్యుత్సాహం చూపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక కేసు విషయంలో ఆమె భర్త ఆచూకీ చెప్పాలంటూ.. హోటల్‌కు వచ్చిన సీఐ అంజు.. మహిళను బలవంతానా లాక్కెళ్లి జీపులోకి తోశారు. సీఐ అంజు యాదవ్ రోడ్డుపై.. జనం ముందు.. చేసిన ఈ దౌర్జన్యాన్ని కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల అంజు యాదవ్ పై పలు ఆరోపణులు వెల్లువెత్తాయి. శ్రీకాళహస్తి ఆలయం ముందుండే వీధి వ్యాపారులపై దాడి చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారీ సర్కిల్ ఇన్ స్పెక్టర్. ఎమ్మెల్యే మధుసూదన్ కూతురుతోనూ రేణిగుంట రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. శ్రీకాళహస్తి టీడీపీ మహిళా నేతపైనా ఇదే ప్రవర్తన. సీఐపై తరచూ ఇలాంటి వివాదాలు వస్తూనే ఉండటంపై స్థానికులు మండి పడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఈ దుందుడుకు ప్రవర్తనేంటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Follow us on