Syria photo: అతడికి కాలు లేదు.. బాబుకు కాళ్లు, చేతులు లేవు.. అయినా ముచ్చటేస్తున్నారు !సిపా అవార్డ్స్‌ విన్నర్‌..(వీడియో)

Updated on: Nov 03, 2021 | 9:06 AM

శిల్పి ఉలి పోట్లను తట్టుకున్న రాయి మాత్రమే అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే... గేయాలను రచించగలరంటాడో కవి. ఎన్నో గాయాల దుఃఖాల తర్వాతే అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది.


శిల్పి ఉలి పోట్లను తట్టుకున్న రాయి మాత్రమే అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే… గేయాలను రచించగలరంటాడో కవి. ఎన్నో గాయాల దుఃఖాల తర్వాతే అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది. ఆ గాయాలన్నీ మరిచి చిద్విలాసాలను చిందించడానికి ఎంతటి సహృదయత కావాలి. యుద్ధనేల సిరియాలో జరిగిన ఓ బాంబుదాడిలో కాలును కోల్పోయాడు మున్జీర్‌. యుద్ధంలో వెలువడిన నెర్వ్‌ గ్యాస్‌ని పీల్చుకున్నందుకు కాళ్లు, చేతులు లేని కొడుకు ముస్తఫాకి జన్మనిచ్చింది తల్లి జీనెప్‌. సిరియాలో యుద్ధం తీసుకెళ్లిపోయిన తమ సంతోషాన్ని వెతుక్కుంటూ సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో స్థిరపడిందా కుటుంబం.

ఓ సంతోష సమయాన ఆ తండ్రీకొడుకుల నవ్వులను క్లిక్‌మనిపించాడు టర్కిష్‌ ఫొటోగ్రాఫర్‌ మెహ్మత్‌ అస్లన్‌. సియెనా ఇంటర్నేషనల్‌ ఫొటో అవార్డ్స్‌ 2021లో ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని చెప్పాడు అస్లన్‌.

మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)

Loading...
Unable to load recommendations.
Follow Us