Viral Video: వరుడు 93-వధువు 63.. చర్చిలో పెళ్లి..! నాలుగో పెళ్ళికి సిద్ధమైన వ్యోమగామి బజ్‌ ఆల్‌ డ్రిన్‌.. వీడియో.

| Edited By: Ravi Kiran

Jan 30, 2023 | 8:35 AM

చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యక్తి బజ్‌ ఆల్‌ డ్రిన్‌ గుర్తున్నారుకదా... ఎస్‌.. అపోలో 11 అంతరిక్ష యాత్రలో భాగంగా 1969లో బజ్‌ ఆల్‌ డ్రిన్‌ చంద్రుడిపైకి వెళ్లారు. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై


చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యక్తి బజ్‌ ఆల్‌ డ్రిన్‌ గుర్తున్నారుకదా… ఎస్‌.. అపోలో 11 అంతరిక్ష యాత్రలో భాగంగా 1969లో బజ్‌ ఆల్‌ డ్రిన్‌ చంద్రుడిపైకి వెళ్లారు. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలుమోపిన 19 నిమిషాల తర్వాత బజ్ మూన్‌పై తన కాలు మోపారు. అపోలో 11 మిషన్ లో ముగ్గురు వ్యోమగాములు ఈ యాత్ర చేయగా వారిలో బజ్ మాత్రమే ప్రస్తుతం ప్రాణాలతో మిగిలి ఉన్నారు. అంతేకాదు. ఆయన తాజాగా పెళ్లి కూడా చేసుకున్నారు. అవును ఇప్పుడు ఆయన వయస్సు 93 ఏళ్లు. అదికూడా ఆయన పుట్టినరోజునాడే. ఆల్‌డ్రిన్‌ 1930 జనవరి 20 పుట్టారు. తాజాగా ఆయన తన చిరకాల ప్రేయసి 63 ఏళ్ల డాక్టర్‌ అంకా ఫౌర్‌ను నాలుగో వివాహం చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఈ వ్యోమగామికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్న డ్రిన్‌ ఆ పెళ్లి ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. తనపుట్టినరోజునాడు ఇలా తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. టీనేజ్‌ ప్రేమికుల్లాగే చాలా కిక్‌ ఇస్తోందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on