ATM Robbery: పోలీస్‌ స్టేషన్‌ వద్దే రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టి

Updated on: Sep 01, 2026 | 4:06 PM

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఎస్‌బీఐ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బ్యాంక్ అలర్ట్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించగా, ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే చోరీ జరగడంతో భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నార్డాణా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషీన్‌ను కట్ చేసి, అందులోని లక్షలాది రూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ భారీ చోరీ జరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. రాత్రి సమయంలో పెట్రోలింగ్ మరియు భద్రతా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎం నుంచి బ్యాంక్ అలర్ట్ సిస్టమ్‌కు సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనాస్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తోంది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలిస్తూ పరారైన దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు!

Loading...
Unable to load recommendations.
Follow Us