Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

Updated on: Sep 01, 2026 | 5:22 PM

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉపాధి హామీ పనుల్లో అరుదైన అపరకాళి విగ్రహం వెలుగుచూసింది. బ్రహ్మంగారి గుడి వద్ద తవ్వకాలు చేస్తుండగా ఆరు భుజాలు, ఆరు అస్త్రాలతో రాక్షసుడిని వధిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడింది. స్థానికులు విగ్రహాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురావస్తు అధికారులు ఇది పంచలోహమా, రాతి విగ్రహమా, ఎన్నేళ్ల నాటిదో తెలుసుకునేందుకు పరిశోధనలు ప్రారంభించారు. గతంలోనూ ఇక్కడ విగ్రహాలు లభించడంతో ప్రాంత చారిత్రక ప్రాధాన్యంపై ఆసక్తి పెరిగింది.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా అపరకాళి విగ్రహం బయటపడింది. బ్రహ్మంగారి గుడి వద్ద కార్మికులు పనులు చేస్తుండగా ఈ విగ్రహం భూమిలో లభించింది. ఆరు భుజాలు, ఆరు అస్త్రాలతో, రాక్షసుడిని కాళ్లకింద తొక్కి వధిస్తున్నట్లుగా ఉన్న అమ్మవారి చండప్రచండ స్వరూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికితీసిన స్థానికులు వెంటనే పండితుల ఆధ్వర్యంలో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇది చాలా పురాతన కాలం నాటి విగ్రహమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ విగ్రహం పంచలోహాలతో తయారైందా లేక రాతి లేదా, ఇతర లోహంతో కూడుకున్నదా అనే కోణంలో పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు ప్రారంభించారు. అలాగే ఇది ఎన్నేళ్ల నాటిదో తేల్చేందుకు నిపుణుల బృందం కసరత్తు చేస్తోంది. గతంలోనూ ఇక్కడ ఇలాంటి విగ్రహాలు కొన్ని బయటపడటంతో, ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!

ATM Robbery: పోలీస్‌ స్టేషన్‌ వద్దే రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టి

ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు!

Loading...
Unable to load recommendations.
Follow Us