అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం

Updated on: Sep 13, 2026 | 5:52 PM

ఢిల్లీలో సంతానలేమి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 26 ఏళ్ల యువకుడిలో వైద్యులు అరుదైన పరిస్థితిని గుర్తించారు. అతడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడింది. దీనిని పర్సిస్టెంట్‌ ముల్లెరియన్‌ డక్ట్‌ సిండ్రోమ్‌గా వైద్యులు తెలిపారు. జన్యుపరంగా పురుషుడైనప్పటికీ స్త్రీ పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందడం ఈ సిండ్రోమ్‌ ప్రత్యేకత. వైద్యులు శస్త్రచికిత్స చేసి అదనపు అవయవాలను తొలగించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఢిల్లీలో వైద్య రంగాన్ని విస్మయానికి గురిచేసే ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. సంతానలేమి సమస్యతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణ పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ వింత విషయం బయటపడటంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’ అని పిలుస్తారని వైద్య నిపుణులు తెలిపారు. జన్యుపరంగా పురుషుడిగా ఉన్నప్పటికీ, వారి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కూడా అభివృద్ధి చెందడం ఈ సిండ్రోమ్ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు 300 లోపు మాత్రమే నమోదయ్యాయని వారు వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన స్థితి కావడంతో దీనిని గుర్తించడం కూడా కష్టతరమని పేర్కొన్నారు. ఈ సమస్యను నిర్ధారించిన వైద్యులు, ఆ యువకుడికి వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. అతడి కడుపులో ఉన్న గర్భాశయ సంబంధిత అదనపు భాగాలను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Loading...
Unable to load recommendations.
Follow Us