రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్..బాలుడి బర్త్‌డే వేడుకలు వైరల్‌

Updated on: May 27, 2026 | 3:33 PM

జార్ఖండ్‌కు చెందిన సూరజ్ అనే బాలుడు తన పుట్టినరోజుకు రూ.100 మ్యాగీ ప్యాకెట్‌తో స్నేహితులకు పార్టీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్న స్టౌపై మ్యాగీ వండుతూ పిల్లలతో కలిసి ఆనందంగా గడిపిన ఈ క్షణాలు నెటిజన్ల హృదయాలను కదిలించాయి. వీడియోకు లక్షల వ్యూస్ రావడంతో సూరజ్‌కు సాయం చేయాలంటూ నెటిజన్లు ముందుకొస్తున్నారు.

సహజంగా ఎవరైనా పుట్టిన రోజంటే ఆడంబరంగా వేడుకలు చేసుకుంటారు. వారికి తోచిన స్థాయిలో వేడుకలు జరుపుకొంటుంటారు. అందుకు భిన్నంగా పేదింట్లో వేడుకల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అంత స్పెషాలిటీ ఏముందో చూద్దామా. వేల రూపాయల ఆడంబరాలు, ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్ల విందులు ఇవ్వలేని సంతోషం.. ఒక వంద రూపాయల మ్యాగీ ప్యాకెట్‌లో దొరికింది. పేదరికం గుమ్మం ముందు నిలబడినా, సంతోషాన్ని నలుగురితో పంచుకునే మనసుంటే ఉన్న దాంట్లోనే ప్రపంచాన్ని గెలవచ్చని నిరూపించాడు జార్ఖండ్‌ కు చెందిన ఓ కుర్రాడు. ఓ చిన్న మ్యాగీ ప్యాకెట్, కూల్ డ్రింక్ బాటిల్, ఒక చిన్న స్టౌ చుట్టూ చేరిన కొంతమంది చిన్నారులు చేసుకున్న ఓ బర్త్‌ డే పార్టీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది చూసిన నెటిజన్లు సూరజ్‌‌కు పుట్టినరోజు బహుమతులు అందించేందుకు ఏకంగా ‘యూపీఐ’ ఐడీ ఇవ్వాలంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ రీల్ ఓపెన్ చేయగానే.. సూరజ్ స్నేహితుడు కెమెరా ముందుకు వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడాడు. ‘హలో గాయ్స్.. ఈరోజు సూరజ్ బర్త్‌డే. తను మా కోసం 100 రూపాయల మ్యాగీ తీసుకొచ్చాడు. దాంతో పాటు కూల్‌ డ్రింక్ కూడా ఉంది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు.. సూరజ్ మాకు గ్రాండ్‌గా పార్టీ ఇస్తున్నాడు అంటూ హిందీలో పరిచయం చేశాడు. ఆ తర్వాత సూరజ్ ఒక చిన్న స్టౌ మీద నవ్వుతూ మ్యాగీ వండుతుండగా, చుట్టూ ఉన్న పిల్లలంతా విందు కోసం ఆశగా ఎదురుచూడటం వీడియోలో కనిపించింది. అయితే, వీడియో పోస్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే ఏకంగా 3 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వీడియో చూసిన వేలాది మంది సూరజ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పడమే కాకుండా అతడి కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి, మంచి గిఫ్ట్ పంపించడానికి వీలుగా సూరజ్ యూపీఐ ఐడీ , క్యూఆర్ కోడ్‌ను షేర్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..

రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..

అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్

Follow Us