Cheetah – deer: ఏం ధైర్యం సామీ మీది..చిరుతను కర్రతో బెదిరించి జింకను లాక్కెళ్లిపోయారు.. వీడియో.

|

Oct 09, 2022 | 5:50 PM

'ఇద్దరు వ్యక్తులు కర్రను చూపించి చిరుతల ఆహారాన్ని దొంగిలించారు. అలా చేసే ధైర్యం మీకు ఉందా? 'చిరుతలు ఆకలితో లేవు, కాబట్టి అవి దాడి చేసి ఉండవు' అని


ఎంతో కష్టపడి వేటాడిన చిరుతలకు ఇద్దరు వ్యక్తులు ఊహించని షాక్ ఇచ్చారు. చిరుత వేటాడిన ఆహారాన్ని వాటినుంచి లాక్కుని వెళ్లిపోయారు. వారిని అడ్డుకునేందుకు చిరుతలు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు చిరుతలు ఓ జింకను వేటాడాయి. ఆ చిరుతలు తమ ఆహారాన్ని ఆరగిద్దామనుకునే సమయానికి సరిగ్గా ఇద్దరు వ్యక్తులు అక్కడ ఎంట్రీ ఇచ్చారు. చిరుతలు ఎంతో కష్టపడి వేటాడిన జింకను క్రూర మృగాలైన చిరుతల నుంచి లాక్కున్నారు. ఆఫ్రికాలోని టాంజానియాలో నివసిస్తున్న మసాయి తెగకు చెందిన ఇద్దరు వ్యక్తులు చిరుతల వద్దకు వచ్చారు. కేవలం చిన్న కర్రతో ఆ చిరుతలను బెదిరించి ఆహారాన్ని పట్టుకుపోయారు. వారి వద్ద నుంచి జింకను తిరిగి తీసుకునేందుకు చిరుతలు వెంటపడినప్పటికీ వాటికి ఆహారం దక్కలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Follow us on