చిన్నారికి వింత వ్యాధి.. ఒంటినిండా బొబ్బలతో వీడియో

Updated on: Oct 20, 2025 | 1:20 PM

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఓ చిన్నారి ఒంటినిండా బొబ్బలతో బాధపడుతోంది. శీతాకాలంలో వైరస్‌ల వ్యాప్తి భయాల మధ్య ఈ ఘటన ఆందోళన రేకెత్తించింది. జిల్లా వైద్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై చిన్నారికి చికిత్స అందించి, విజయవాడ GGHకి తరలించారు. ఇది వింత వ్యాధి కాదని, అపోహలు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.

వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వైరస్‌ల వ్యాప్తి భయాలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో ఓ చిన్నారి ఒంటినిండా బొబ్బలతో తీవ్ర ఆందోళన కలిగించింది. చిన్నారికి వింత వ్యాధి సోకిందన్న ప్రచారం విస్తృతంగా సాగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారికి చికిత్స అందించిన అనంతరం మెరుగైన పరీక్షల నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)కి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో