‘నెయ్యి అనే పదార్థం లేకుండానే లడ్డూని తయారు చేశారు’
టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ తిరుమల లడ్డూల కల్తీపై సంచలన ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లుగా నెయ్యి లేకుండానే లడ్డూలను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. రూ.251 కోట్ల ఆర్థిక లబ్ధి కోసం ఈ మోసానికి పాల్పడ్డారని, ఇందులో కొందరు నాయకులకు పాత్ర ఉందని నెహ్రూ ఆరోపించారు. లడ్డూల తయారీలో విషపూరిత పదార్థాలు వాడారనే తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.
జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో గత ఐదేళ్లుగా నెయ్యి అనే పదార్థాన్ని ఉపయోగించలేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఇది పంది నెయ్యి లేదా పంది కొవ్వు వంటిది కాదని, అసలు నెయ్యిని వాడకుండానే లడ్డూలను తయారు చేశారని నెహ్రూ పేర్కొన్నారు. నెయ్యి పేరుతో భక్తులను మోసం చేసి, కేవలం 251 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి కోసమే ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వ్యక్తులు ప్రధాన పాత్రధారులని జ్యోతుల నెహ్రూ పేరుకున్నారు.