చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

Updated on: Apr 16, 2026 | 3:55 PM

నిజామాబాద్‌లో మండుటెండకు ఓ కోతి ఊయలలో ఊగుతూ ఉపశమనం పొందిన వీడియో వైరల్‌గా మారింది. భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఇంటి ఆవరణలోని ఊయలలోకి చేరి, మనుషుల్లాగే హాయిగా ఊగుతూ ఎండనుండి తప్పించుకుంది. ఈ వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రకృతి ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన ఈ వానరం వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

భానుడి భగభగలకు మనుషులే కాదు, మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో దారి వెతుక్కుంటున్నారు. అయితే, నిజామాబాద్ జిల్లాలో ఓ వానరం మాత్రం ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎంచుకున్న మార్గం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఊయల ఊగుతూ ఎంజాయ్‌ చేస్తున్న కోతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలోని చెట్టుకు పిల్లల కోసం ఒక ఊయలను కట్టారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక చల్లని నీడ కోసం అక్కడికి వచ్చిన ఓ కోతికి ఆ ఊయల కనిపించింది. ఇంకేముంది.. మెల్లగా ఆ ఊయలపైకి ఎక్కి కాసేపు హాయిగా ఊగుతూ సేదతీరింది. మనుషుల లాగే ఆ ఊయలలో అటూ ఇటూ ఊగుతూ ఆ వానరం చేసిన సందడిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.సాధారణంగా చెట్లపై కొమ్మలు పట్టుకుని గెంతే కోతులు, ఇలా ఊయలెక్కి ఊగడం చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు.ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న ఈ వానరం వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌

ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

ఈ వీకెండ్ సినిమా సెట్టు..OTTలో అద్భుతమైన హర్రర్ కామెడీ మూవీ..

Dhurandhar: 3వేల కోట్ల వసూళ్లతో.. ఇండియాలోనే ‘నెంబర్ 1’ గా ధురంధర్

Follow Us