నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..

Updated on: Nov 14, 2026 | 6:49 PM

నాగుల చవితి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరంలోని సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో నాగుల చవితి పర్వదినం సందర్భంగా అరుదైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సారంగధరమెట్టపై వెలసిన శ్రీ బాలా త్రిపురసుందరి దేవి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కళకళలాడింది. ఈ పవిత్రమైన రోజున ఆలయ ప్రాంగణంలో జరిగిన ఓ అద్భుత ఘటన అందరినీ భక్తిపారవశ్యానికి గురిచేసింది. దేవస్థానంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయానికి నాగుల చవితి పర్వదినాన ఒక నాగసర్పం ప్రత్యక్షమైంది. నాగుల చవితి పర్వదినాన సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ప్రాంగణంలో సర్పం ప్రత్యక్షం కావడంతో అక్కడి అర్చకులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఈ వార్త క్షణాల్లో భక్తులకు తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ నాగుపామును తిలకించారు.ఈ అరుదైన ఘటనను భక్తులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహంగా భావించారు. నాగుల చవితి రోజున స్వామివారికి ఇష్టమైన సర్పం ప్రత్యక్షం కావడంతో అంతా భక్తితో పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి నాగుపామును బంధించి సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగుల చవితి పర్వదినాన ఆలయంలో నాగుసర్పం ప్రత్యక్షం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెహ్వాగ్ కొడుక్కి.. కోహ్లీ స‌ల‌హా ఇదే.. వైరల్ అవుతున్న ఆర్యవీర్ పాత ఇంటర్వ్యూ

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. 54 ప్రత్యేక రైళ్లు!

ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!

వాట్సాప్, టెలిగ్రామ్‌లకు కొత్త రూల్స్

పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ సెక్యూరిటీ!

Loading...
Unable to load recommendations.
Follow Us