Music dialysis: కిడ్ని రోగులకు మ్యూజిక్‌ చికిత్స.. ఆహ్లాద ప్రదేశంగా హాస్పిటల్‌..

|

Jul 06, 2022 | 11:45 AM

ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. కిడ్ని పేషంట్ల కోసం గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది ఓ క్లినిక్. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో సంగీతాలతో అలరిస్తారు.


ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. కిడ్ని పేషంట్ల కోసం గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది ఓ క్లినిక్. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్లు డయాలసిస్‌ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్‌కి వచ్చి డయాలసిస్‌ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరసించి పోతుంటారు. అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ… డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. వీరిని కదిలిస్తే .. సంగీతం తమకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు. ఇప్పుడు తమకు క్లినిక్‌ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే “హాస్పిటల్ టాంగో” అనే ప్రాజెక్ట్‌ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిరూపితమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

 

Follow us on