రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

Updated on: Mar 02, 2026 | 11:53 AM

మధ్యప్రదేశ్‌లోని రెవాలో కొత్తగా నియమితులైన పోలీస్ ట్రైనీలు యూనిఫాంలో చేసిన సరదా రీల్ వైరల్‌గా మారింది. ఈ రీల్‌పై పోలీస్ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి ట్రైనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, నెటిజన్లు ఈ చర్యను తప్పుబడుతూ, చిన్న సరదాపై ఇంత కఠినంగా వ్యవహరించడం అవసరం లేదంటూ అభిప్రాయపడుతున్నారు.

మధ్యప్రదేశ్‌ లోని రెవాలో పోలీస్‌ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న కొత్త కానిస్టేబుల్స్‌ సరదాగా చేసిన రీల్‌ వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కానిస్టేబుల్స్‌గా కొత్తగా నియమితులైన ఆరుగురు పోలీసులు పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.. ఆ ఆరుగురు ట్రైనీ పోలీసులు ఒక రీల్‌ తీశారు. యూనిఫాంలో ఉన్న యువ పోలీసులు జోకులు వేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంపై గొప్పలు పోయారు. ‘నేను అందంగా లేకపోతే ఏం? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నా వద్ద ఎక్కువ డబ్బు లేకపోతే ఏం? నాకు నెలవారీ జీతం వస్తుంది. నాకు ఎక్కువ బట్టలు లేకపోతే ఏం? నాకు యూనిఫాం ఉంది’ అని వారు అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీరు పోస్ట్ చేసిన రీల్‌ వైరల్‌ అయింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ రీల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ట్రైనీ పోలీసుల రీల్‌ను కొందరు ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. పోలీస్ యూనిఫాం ధరించి రీల్‌ చేయడాన్ని పోలీస్ శాఖ తప్పుపట్టింది. నియమ నిబంధనలను, క్రమశిక్షణను ఆ ట్రైనీ పోలీసులు ఉల్లంఘించినట్లు ఆరోపించింది. వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. వారి వివరణ ఆధారంగా యాక్షన్‌ తీసుకుంటామని తెలిపింది. అయితే నెటిజన్లు ఈ చర్యను తప్పుబడుతున్నారు. సరదాగా చేసిన రీల్‌పై అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు

US-Israel Strikes On Iran: ఇరాన్ పై B2 బాంబులను వదిలిన అమెరికా

Loading...
Unable to load recommendations.
Follow Us