దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!
వరంగల్ నగరంలో కోతుల గుంపులు, వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాపువాడ ప్రాంతంలో కోతులు ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుండగా, వీధి కుక్కల దాడుల్లో ప్రతిరోజూ పలువురు గాయపడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ నగర ప్రజలకు ప్రస్తుతం ప్రాణభయం పట్టుకుంది. ఒకవైపు కోతుల గుంపులు, మరోవైపు వీధి కుక్కల స్వైర విహారంతో నగరం అట్టుడుకుతోంది. ఇంట్లో ఉంటే వానర సేనలు హడలెత్తిన్నాయి.. బయటకొస్తే కుక్కలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దేవుడా ఏమిటీ మాకీ పరిస్థితి అంటూ మొరపెట్టుకుంటున్నారు స్థానికులు. నగరంలోని కాపువాడ సమీపంలో ఓ ఇంట్లోకి చొరబడిన కోతుల గుంపు బీభత్సం సృష్టించింది. ఇంట్లోని నిత్యావసర వస్తువులు, తినుబండారాలను చిందరవందర చేస్తూ ‘కిష్కిందకాండ’ను తలపించింది. వాటిని అడ్డుకోబోయిన స్థానికులపైకి తిరగబడుతూ, రక్కేందుకు ప్రయత్నించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వీధి కుక్కల బెడద నగరంలో పతాక స్థాయికి చేరింది. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుక్కలు దాడులకు తెగబడుతుండటంతో సగటున రోజుకు పది మందికి పైగా గాయపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. వీధిలోకి వెళ్లాలంటేనే నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. ఇంట్లో కోతులు, బయట కుక్కల దాడులతో తమ ప్రాణాలకు రక్షణ కరువైందని వరంగల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ఈ వానరాల, శునకాల బెడద నుండి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాకతీయ వైభవానికి మరో మకుటం.. ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా? సాధారణ వంటకం ఎందుకంత ఖరీదైందంటే?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే..
