బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
భారతీయ వివాహాల్లో బంగారు నగలకు బదులు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ధరించే ట్రెండ్ పెరుగుతోంది. నేటి యువత ఆడంబరాలకు దూరంగా ఉండి, భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పులు చేసి బంగారం కొనడం కంటే, ఆ డబ్బును తమ భవిష్యత్తు కోసం ఆదా చేయాలని భావిస్తున్నారు. 'నో గోల్డ్ జ్యువెలరీ' కాన్సెప్ట్‌తో అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటూ, ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాధారణంగా భారతీయ వివాహాల్లో వధువు బంగారు నగలు ధరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కాలంలో యువత ఈ విషయంపై పునరాలోచన చేస్తున్నారు. ఈ బంగారానికి వెచ్చించే డబ్బు భవిష్యత్తు భద్రతకు ఉపయోగిస్తే మంచిది కదా అని ఆలోచన చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గోల్డ్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్టిఫిషియల్ నగలపై మొగ్గుచూపుతున్నారు. నో గోల్డ్ జ్యువెల్లరీ కాన్సెప్ట్‌తో పెళ్లికి సిద్ధమవుతున్నారు. పెళ్లి పీటలపై బంగారంతో మెరిస్తేనే గౌరవం అని భావించే సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఆడంబరాల కంటే ఆత్మీయతే ముఖ్యం అనే ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోంది నేటి యువత. అప్పులు చేసి నగలు కొనడం కంటే ఆత్మీయ అనురాగాలు గొప్పవనీ , పసిడి వెలుగుల కంటే తమ జీవిత ఆశయాలే ముఖ్యమని భావిస్తున్నారు. . ఈ సమాజం ఏమనుకుంటుందో అనే సంకుచిత భావన వీడి ఆదర్శంగా అడుగులు వేస్తున్నారు. ప్రదర్శన కోసం ఖర్చు పెట్టి అప్పుల పాలు కావడం కంటే పర్సనల్ లోన్‌కు ఈఎంఐలు కట్టాలనే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన భవిష్యత్తు ముఖ్యమని అంటున్నారు. ఆర్టిఫిషియల్ జ్యుయెల్రీని ఫ్యాషన్ జ్యువెలరీ పెట్టుకుంటున్నారు. పెళ్లి రోజు ఫోటోల కోసం నగలను రెండు మూడు రోజులకు అద్దెకు తీసుకుని ఖర్చులు తగ్గించుకుంటున్నారు. నో గోల్డ్ జ్యువెల్లరీ కాన్సెప్ట్‌తో పెళ్లి తర్వాత అప్పులు మిగలకుండా ప్రశాంత జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే భారీగా బంగారం కొని దానికి భద్రపరచడం కోసం లాకర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మధ్య తరగతి కుటుంబాల్లో పెళ్లిళ్ల కోసం చేసే అప్పులను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా అన్నీ కోణాల్లో ఆలోచించి అనవసరపు ఆర్భాటాలకు దూరంగా ఉండాలని నిర్ణయిస్తున్నారు. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో వృథా ఖర్చు తగ్గించడం ఒకటి. బంగారం మీద డబ్బు ఖర్చు పెట్టడం కంటే తమ భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం దాచుకోవాలని భావిస్తున్నారు. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్షణం ఎలాంటి అవసరాలు వస్తాయో అని ముందు జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే బంగారం వేసుకోవడమే గౌరవం అనే పాత సంప్రదాయాన్ని మార్చాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అప్పులు చేసి ఆడంబరంగా ఉండడం కంటే.. రెండు మనసులు కలిసినప్పుడే పెళ్లికి అసలైన అర్థం అని చాటి చెప్పడం ముఖ్యమని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు
