ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. తల్లిదండ్రులకు సూచన

Updated on: Feb 10, 2026 | 9:35 AM

మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద సెల్ఫీ మోజు ఓ నిండు ప్రాణం తీసింది. పలకల క్వారీలో స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటుండగా, 14 ఏళ్ల ఏసుబాబు కాలు జారి నీటిలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించారు.

ఒక చిన్న సరదా.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సెల్ఫీలపై ఉన్న మోజు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సెలవు రోజును స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనుకున్న ఆ బాలుడు, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఉన్న పలకల క్వారీ గుంతలో పడి 14 ఏళ్ల ఏసుబాబు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఏసుబాబు స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటుండగా, బాలుడు ఇక్కడ అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులు జాన్ వెస్లీ, అభిరామ్‌లతో కలిసి రాయవరంలోని నగరవనం పార్కుకు వెళ్లాడు. అక్కడ కాసేపు ఆడుకున్నాక, ముగ్గురూ కలిసి సమీపంలోని పలకల క్వారీ వద్దకు వెళ్లారు. నీటితో నిండి ఉన్న లోతైన క్వారీ గుంత అంచున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, ఏసుబాబు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. భయంతో స్నేహితులు కేకలు వేసినా ఫలితం లేకపోవడంతో, వారు ఇంటికి వెళ్లి బంధువులకు సమాచారం అందించారు. మార్కాపురం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గజఈతగాళ్ల సాయంతో గాలించి రాత్రి 8 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. జలపాతాలు, నీటి కుంటలు, లోతైన క్వారీ ప్రాంతాల్లో ఫోటోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !

మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు

Loading...
Unable to load recommendations.
Follow Us