వాష్‌ రూమ్‌కి వెళ్లిన యువకుడు..అక్కడి సీన్‌ చూసి షాక్‌ వీడియో

Updated on: Oct 20, 2025 | 10:52 AM

విశాఖపట్నంలోని శ్రీహరిపురం రామ్ నగర్ కాలనీలో ఓ యువకుడు ఉదయాన్నే వాష్ రూమ్ వద్ద 8 అడుగుల భారీ కింగ్ కోబ్రాను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వింత శబ్దాలు విని లైట్ వేసి చూడగా, పాము కనిపించింది. కుటుంబ సభ్యులు, పొరుగువారి సహకారంతో స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇవ్వగా, ఆయన చాకచక్యంగా దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

విశాఖపట్నం జిల్లాలోని శ్రీహరిపురం ప్రాంతం రామ్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్న యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఉదయాన్నే లేచి వాష్ రూమ్ కి వెళ్ళిన అతనికి వింత శబ్దాలు వినిపించాయి. అనుమానంతో లైట్ వేసి చూసినా ఏమీ కనిపించలేదు. అయితే, బాత్రూం పక్కన ఉన్న చిన్న సందులో ఎనిమిది అడుగుల భారీ కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కనిపించింది. ఈ దృశ్యంతో భయంతో కేకలు వేస్తూ ఆ యువకుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. అతని కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో వాళ్లకు, పొరుగువారికి సమాచారం అందించగా, వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు ఫోన్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో