Kiss With Snake: మదమెక్కి మందుమత్తులో నాగుపాముకి లిప్ లాక్ లు.. చివరికి.. వీడియో.

Updated on: Mar 15, 2023 | 9:04 PM

మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఫుల్‌గా మద్యం సేవించిన అతను ఓ భారీ నాగుపాముకు ముద్దు పెట్టాడు. ఆ విషపు నాగును మెడలో వేసుకొని డాన్సులు చేశాడు.

మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఫుల్‌గా మద్యం సేవించిన అతను ఓ భారీ నాగుపాముకు ముద్దు పెట్టాడు. ఆ విషపు నాగును మెడలో వేసుకొని డాన్సులు చేశాడు. ఈ విచిత్ర సంఘటనను చూసేందుకు స్థానికులు పోటెత్తారు. పాముతో చెలగాటాలొద్దని, దానిని విడిచిపెట్టాలని ఎంత చెప్పినా వినలేదు. మద్యం మైకంలో అతను పామును హత్తుకుంటూ ముద్దులు పెట్టాడు. అదే సమయంలో పాము అతన్నికాటేసింది. అయితే మైకంలో ఉన్న అతనికి అది తెలియలేదు. అలా చాలాసేపు పాముతో డాన్సులు చేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి పామును వదిలిపెడ్డాడు. అనంతరం అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లోని నవాడలో జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 09:04 PM