వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా

Updated on: Apr 16, 2026 | 3:57 PM

మహబూబాబాద్‌లో ఓ పాల దొంగ షాపు యజమానులకు నిద్రలేకుండా చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే ట్రేలలోని పాల ప్యాకెట్లు మాయమవుతుండటంతో ఆందోళన చెందిన యజమాని సీసీ కెమెరాలు పరిశీలించగా షాకింగ్ నిజం బయటపడింది. పాల వ్యాన్ వెళ్లిన వెంటనే ఒక బాలుడు పాల ప్యాకెట్లను అపహరిస్తున్నట్లు రికార్డయ్యింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, వీడియో వైరల్ అవుతోంది.

సాధారణంగా దొంగలు బంగారం, నగదు కోసం ఆశపడతారు. కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం ఓ “పాల దొంగ” షాపు యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే పాల ప్యాకెట్లు మాయమవుతుండటంతో అసలేం జరుగుతుందో తెలియక తలపట్టుకున్న యజమానికి, సీసీ కెమెరా దృశ్యాలు చూశాక అసలు విషయం బోధపడింది. జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్‌లో గల ‘తారా టీ స్టాల్’ వద్ద ఈ వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు పాల వ్యాన్ వచ్చి, షాపు ముందు ట్రేలలో పాల ప్యాకెట్లను దించి వెళ్తోంది. అయితే, యజమాని వచ్చి చూసేసరికి ప్రతిరోజూ 8 నుండి 10 ప్యాకెట్లు తక్కువ వస్తున్నాయి. దీంతో పాల సరఫరా దారులకు, షాపు యజమానికి మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి. పాల ప్యాకెట్లు ఏమైపోతున్నాయో తెలుసుకోవాలని యజమాని సీసీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే నిజం బయటపడింది. పాల వ్యాన్ వెళ్లిపోయిన కొద్ది నిమిషాలకే ఒక బాలుడు అక్కడికి చేరుకుంటున్నాడు. ఎవరూ లేని సమయం చూసి సైలెంట్‌గా ట్రేలలోని పాల ప్యాకెట్లను అపహరిస్తున్నాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ఆ బాలుడు ఎవరనేది ఇంకా గుర్తుపట్టలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తెల్లవారుజామున జరిగే ఈ “పాల చోరీ” వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌

ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

ఈ వీకెండ్ సినిమా సెట్టు..OTTలో అద్భుతమైన హర్రర్ కామెడీ మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us