Anti-pee paint: అక్కడ గోడలపై మూత్రం పోశారంటే అంతే సంగతి.. తిరిగి వారిపైనే పడుతుంది.. వీడియో.

| Edited By: Ravi Kiran

Jan 30, 2023 | 7:45 AM

సాధారణంగా పురుషుల్లో చాలామంది రోడ్లపై వెళ్తున్నప్పుడు మూత్రం ఆత్రంగా వస్తే బాత్రూమ్‌ల గురించి ఆలోచించరు. బాత్రూమ్‌ల కోసం వెతకడం కంటే గోడకేసి పాట పాడటమే మేలని భావిస్తారు.


సాధారణంగా పురుషుల్లో చాలామంది రోడ్లపై వెళ్తున్నప్పుడు మూత్రం ఆత్రంగా వస్తే బాత్రూమ్‌ల గురించి ఆలోచించరు. బాత్రూమ్‌ల కోసం వెతకడం కంటే గోడకేసి పాట పాడటమే మేలని భావిస్తారు. బాటసారులుగానీ, బైకర్‌లుగానీ, మరే ఇతర వాహనాల్లో వెళ్లేవారుగానీ ఖాళీ గోడ కనపడిందంటే వాహనం ఆపేసి పని కానిచ్చేస్తారు. దాంతో నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతాయి. దాంతో ఆయా ప్రదేశాల గుండా వెళ్లాలంటే ముక్కులు మూసుకుని నడవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు లండన్‌లోని సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ అయిన వెస్ట్‌మినిస్టర్‌ సిటీ అధికార యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా గోడలపై మూత్ర విసర్జన చేస్తే అది తిరిగి వాళ్లే మీదే పడేలా ప్లాన్‌ చేసింది. ఇందుకోసం యాంటీ పీ-పెయింట్‌ను గోడలపై స్ప్రే చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ మేరకు వెస్ట్‌మినిస్టర్‌ సిటీలోని రద్దీ ప్రదేశాలన్నింటిలో గోడలపై యాంటీ పీ-పెయింట్‌ను స్ప్రే చేయించింది.ఈ యాంటీ పీ-పెయింట్‌ను స్ప్రే చేసిన గోడలపై ఎవరైనా మూత్రవిసర్జనకు ప్రయత్నిస్తే.. అది తిరిగి ఆ వ్యక్తిపైకే విరజిమ్ముతుందట. అయితే ఈ గోడలపై తెలియక మూత్రవిసర్జన చేసి ఇబ్బంది పడకుండా .. ఈ పెయింట్‌ వేసిన గోడలపై ‘దిస్‌ వాల్‌ ఈజ్‌ నాట్‌ ఎ యూరినల్‌’ అని హెచ్చరికలు కూడా రాసిపెడుతున్నారట. ఈ హెచ్చరికలను లైట్‌ తీసుకుని ఎవరైనా ఆ పనిచేసేందుకు ట్రై చేస్తే ఇక వాళ్ల ఖర్మ.. అయితే వెస్ట్‌మినిస్టర్‌ సిటీ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి పరిశుభ్రత ఒక్కటే కారణం కాదట. ఖర్చును తగ్గించుకోవడం కూడా ఒక కారణమట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on