వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
హైదరాబాద్ రామంతాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్‌టాప్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. అధిక వేడి కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నేపథ్యంలో నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడటం, మంచాలు లేదా దిండ్లపై ల్యాప్‌టాప్‌ను పెట్టి ఛార్జింగ్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకూ సెల్ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్‌ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్‌ట్యాప్‌లు. అవును.. హైదరాబాద్‌లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించినా, ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో ఓ గదిలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి తన ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ల్యాప్‌టాప్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గదిలో మంటలు చెలరేగడంతో అక్కడున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగిసినా, హాస్టల్ విద్యార్థులను మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ల్యాప్‌టాప్‌లోనే సాంకేతిక లోపం ఉందా? లేక నాసిరకం ఛార్జర్ కారణంగా వేడెక్కిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచాలు, దుప్పట్లు లేదా దిండ్లపై ల్యాప్‌టాప్‌లను ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదని, గాలి ప్రసరణ ఉండే గట్టి ప్రదేశాల్లో మాత్రమే ఛార్జ్ చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడాలని, పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఛార్జింగ్‌లో వదిలేయడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే..
Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..