ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

Updated on: Apr 20, 2026 | 6:51 PM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. రాజీవ్ గాంధీ నగర్‌లో రామకృష్ణ ఇంటి వద్ద అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అమావాస్య వేళ పూజలు నిర్వహించారు. ఇంటి గడప వద్ద కోడిగుడ్లు, మిరపకాయలు, కుంకుమ వంటి వస్తువులు చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పాత కక్షలు లేదా ఇతర కారణాలపై లోతైన విచారణ చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. అర్థరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని చేసిన క్షుద్రపూజలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ నగర్‌లో నివసించే రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం నిద్రలేచిన ఆ ఇంటి ఇల్లాలు వాకిలి ఊడ్చుదామని వెళ్లేందుకు డోర్‌ ఓపెన్‌ చేసింది. ఇంటి గడప ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో భయంతో వణికిపోయింది. వెంటనే ఇంట్లోనివారిని నిద్రలేపి విషయం చెప్పడంతో అందరూ బయటకు వచ్చి చూడగా అక్కడి దృశ్యం అందరినీ భయాందోళనకు గురిచేసింది. అమావాస్య వేళ ఎవరో దుండగులు వారి ఇంటి గుమ్మం ముందే క్షుద్రపూజలు నిర్వహించడంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. రామకృష్ణ ఇంటి గడప వద్ద కోడిగుడ్లు, మిరపకాయలు, రాగిపిండితో వేసిన ముగ్గులు, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. క్షుద్రపూజలకు ఉపయోగించే వస్తువులన్నీ ఇంటి ముందు కనిపించడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఎవరో తమకు కీడు తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతానికి సమీపంలో ఇలాంటి ఘటన జరగడం కాలనీ వాసులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షుద్రపూజలు చేసింది ఎవరు? పాత కక్షల కారణంగా ఈ పని చేశారా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..

Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

బయటకు వెళ్దామని బైక్‌ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్‌

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

Loading...
Unable to load recommendations.
Follow Us