బట్టలు కాదండోయ్.. మనుషులనూ ఉతికి ఆరేస్తుంది వీడియో
ప్రస్తుతం మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్లు చూస్తున్నాం. అయితే.. భవిష్యత్తులో బట్టలు ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మెషీన్లు రాబోతున్నాయి. రోజంతా రకరకాల పనులతో అలసిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే.. మెషీన్ టబ్‌లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. తళతళలాడే శరీరంతో బయటకు రావొచ్చట! ఈ మెషీన్‌లోని కృత్రిమ మేధ ఏఐ వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణనలోకి తీసుకొని వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ నిర్ణయిస్తుంది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జపాన్‌కు చెందిన ‘సైన్స్ కో’ కంపెనీ ఇంజినీర్లు దీనిని తయారు చేశారు. ఫైటర్ జెట్ కాక్‌పీట్ ఆకారంలోని ప్లాస్టిక్ podలోకి మనిషి ప్రవేశించాక సగానికిపైగా గోరువెచ్చని నీరు నిండుతుంది. అందులోనిహైస్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్ముతాయి. మూడు మైక్రో మీటర్ల పరిమాణంలోని అతి సూక్ష్మ బుడగలు ఒత్తిడి సృష్టించి మనిషి శరీరంపై ఉన్న మురికిని తొలగిస్తాయి.స్నానం చేసే వ్యక్తికి సంగీతం వినిపించి ఆహ్లాదపర్చేందుకు అందులో ఏర్పాట్లు ఉన్నాయట. ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ ను 50 ఏళ్ల క్రితం నాటి డిజైన్ ఆధారంగా తయారు చేశారు. అంటే.. ఆలోచన ఎప్పటిదో తెలుస్తోంది కదూ. 1970లోనే జపాన్‌లోని శానియో ఎలక్ట్రిక్ ప్రస్తుత పానసోనిక్ దీనిని తొలిసారి తయారుచేసింది. అప్పటి వెర్షన్ తో పోలిస్తే కొత్తదానిలో అత్యధిక ఫీచర్స్ ఉన్నాయట.
మరిన్ని వీడియోల కోసం :
ఐశ్వర్యారాయ్ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో
సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో
ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
