మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

Updated on: Apr 01, 2026 | 5:47 PM

ఆరున్నర నెలల చిన్నారి గొంతులో మందారపువ్వు ఇరుక్కుని మృతిచెందిన విషాద ఘటన నేపథ్యంలో, పిల్లల్లో ఊపిరాడకపోవడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడం ముఖ్యం. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించడం, సరైన పద్ధతుల్లో వీపుపై ఒత్తిడి కలిగించడం ద్వారా అడ్డుపడిన వస్తువును బయటకు తీయవచ్చు. వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యవసరం. శిశువుల భద్రతకు ఈ జాగ్రత్తలు పాటించాలి.

ఇంట్లో దేవుడి ముందుంచిన మందారపువ్వు గొంతులో ఇరుక్కోవడంతో ఆరున్నర నెలల చిన్నారి మృతి చెందాడు. సుదర్శన్, నవ్య దంపతుల రెండో కుమారుడు చిన్మయ్ గౌడ ఆహారపదార్థం అనుకుని మందారపువ్వు కాడను నోట్లోకి తీసుకుని నమిలి మింగాడు. అది ప్రమాదవశాత్తు గొంతులో ఇరుక్కుపోయింది. అక్కడ్నుంచి వాయునాళానికి అడ్డుపడి ఊపిరాడక చిన్నారి విలవిలలాడాడు. కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. తల్లితండ్రులు హుటాహుటిన చిన్నారిని స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెప్పడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. హున్సూర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిల్లలు తినే సమయంలో వారి గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొలమారిందని పెద్దలు అంటుంటారు. తిన్న ఆహారం కిందికి కదలడం కోసం తలపై తడుతుంటారు. కానీ గొంతులో ఇరుక్కున్న ఆహారంగానీ లేదా నాణెంలాంటి వస్తువుగానీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే వాయునాళంలోకి పోతే చాలా ప్రమాదం. చాలా చిన్నపిల్లల్లో చేయాల్సి వస్తే… పెద్దలు కుర్చీలో కూర్చుని, చిన్నారులు తలకిందులుగా ఉండేలా, వాళ్లను తమ కాళ్లపైన బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టాక, చిన్నారుల వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి కలిగేలా నొక్కాలి. ఇది ఎలా జరగాలంటే… చిన్నారుల నడుము నుంచి వారి రెండు భుజాల మధ్య ప్రాంతంలో మృదువుగా ఒత్తిడి కలిగేలా కదిలిస్తుండాలి. ఇది కూడా క్రమపద్ధతిలో రిథమాటిక్‌గా యాలి. ఒకవైపు పొట్ట మీద పెద్దల కాళ్ల ఒత్తిడీ, మరోవైపు వీపు మీద చేతుల ఒత్తిడి కారణంగా గొంతులో అడ్డు పడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ∙ప్రథమ చికిత్సగా ఇవి చేస్తూ… వీలైనంత త్వరగా పిల్లల్ని హాస్పిటల్‌కు తరలించాలి. గొంతులో ఇరుక్కున్నది బయటకు వస్తే సరి. లేదంటే హాస్పిటల్‌లో అవసరాన్ని బట్టి ఎండోస్కోప్‌ సాయంతో, ఇరుక్కున్న పదార్థాన్ని డాక్టర్లు బయటకు తీస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌

Follow Us