భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!

Updated on: Sep 30, 2026 | 5:03 PM

కెనడాలో నివసిస్తున్న ఢిల్లీకి చెందిన బన్స్‌దీప్‌ సింగ్‌ భారతీయ ఆహారంపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. భారతీయ వంటకాలు తినడం, వండటం మానేసిన తర్వాత తాను మరింత ఫిట్‌గా మారానని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం రోజుకు 150 గ్రాములకు పైగా ప్రొటీన్‌ తీసుకుంటూ క్యాలరీలను నియంత్రిస్తున్నట్లు వివరించాడు. అయితే భారతీయ ఆహారంలో సమస్య లేదని, నూనె, ప్రాసెస్‌డ్‌ పదార్థాల వినియోగమే కీలకమని పలువురు నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు.

కెనడాలో నివసిస్తున్న ఢిల్లీకి చెందిన బన్స్‌దీప్ సింగ్ అనే యువకుడు భారతీయ ఆహారంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. భారతీయ వంటకాలు తినడం పూర్తిగా మానేసిన తర్వాతే తాను జీవితంలో అత్యంత ఫిట్‌గా మారగలిగానని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో తెలిపాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం క్రితం భారతీయ ఆహారాన్ని వండటం, తినడం నిలిపివేశానని చెప్పిన బన్స్‌దీప్.. ప్రస్తుతం రోజుకు 150 గ్రాములకు పైగా ప్రొటీన్ తీసుకుంటూ క్యాలరీలను అదుపులో ఉంచుకుంటున్నట్లు వివరించాడు. భారతీయ వంటకాలు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని, దినుసులు, తాలింపులు, మసాలాలతో శ్రమతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. వంట చేయడం కష్టమనే వాదనతో కొందరు ఏకీభవించగా.. అత్యధికులు సంప్రదాయ భారతీయ ఆహారానికి మద్దతుగా నిలిచారు. మన ఆహారం ఎంతో ఆరోగ్యకరమైనదని, సమస్య వంటకాలతో కాదు.. మనం వాడుతున్న నూనెలు, ప్రాసెస్ చేసిన పదార్థాల్లోనే ఉందని కౌంటర్ ఇచ్చారు. దాంతో తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, ఫిట్‌నెస్ సాధించాలనుకునే వారికి ఒక మార్గం చెప్పడమేనని బన్స్‌దీప్ వివరణ ఇచ్చుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!

ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ల నొప్పులు పరార్!

ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా? రవాణా శాఖ క్లారిటీ!

ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..

విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్.. రైల్వే బైపాస్ లైన్‌ నిర్మాణం

Loading...
Unable to load recommendations.
Follow Us