5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..

Updated on: Feb 12, 2026 | 6:28 PM

హరియాణాలోని మహలానా గ్రామంలో 35 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ పుట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు రోహిత్, సంతోషి కుటుంబానికి తొలి ఆడబిడ్డగా కామాక్షి జన్మించింది. ఏనుగులు, రథాలతో గ్రామం ఊరేగింపు నిర్వహించి, భారీ విందు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకుంది. ఆడపిల్లల ప్రాధాన్యం, లింగ సమానత్వంపై ఈ వేడుక సమాజానికి గొప్ప సందేశమిచ్చింది. 'బేటీ బచావో బేటీ పడావో' స్ఫూర్తిని చాటింది.

ఆడపిల్ల పుట్టిందంటే ఇంకా కొన్ని చోట్ల పెదవి విరిచే సమాజంలో, హరియాణాలోని సోనీపత్ జిల్లా మహలానా గ్రామం భిన్నంగా నిలిచింది. 35 సంవత్సరాల తర్వాత తమ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడంతో ఒక కుటుంబం మాత్రమే కాదు, మొత్తం గ్రామం పండుగలా సంబరాలు జరుపుకొంది. ఈ వేడుక సమాజానికి ఆడపిల్లల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేలా నిలిచింది. జనవరి 6న గ్రామమంతా పండుగ చేసుకుంది. దాదాపు 130 గ్రామాల నుంచి ప్రజలు, బంధువులు, ఆత్మీయులంతా వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఏనుగులు, గుర్రాలు, రథాలతో ఊరేగింపు నిర్వహించి తల్లీకూతురిని ఆహ్వానించారు. గ్రామ వీధుల్లో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఆ ఊరేగింపును చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. చిన్నారి పుట్టిన ఆనందం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించింది! నామకరణ వేడుక నిర్వహించి కుటుంబ సభ్యులు ప్రేమగా చిన్నారికి కామాక్షి అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా కలిసి భోజనాలు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రతి చోటా ఆడపిల్లల గౌరవం, సమానత్వం అనే సందేశం గట్టిగా వినిపించారు. చిన్నారి తండ్రి రోహిత్ మాట్లాడుతూ 35 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ పుట్టిందనీ ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాల్లో అబ్బాయిలకు తగ్గకుండా రాణిస్తున్నారనీ తమ కూతురే తమకు గర్వం అన్నారు. తల్లి కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది తన జీవితంలో అత్యంత ఆనందమైన రోజు అనీ ప్రతి కుటుంబం ఆడబిడ్డ పుట్టినప్పుడు ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని అని ఆమె చెప్పారు. హరియాణాలో గతంలో లింగ వివక్ష, ఆడశిశు హత్యల వంటి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాంటప్పుడు ఈ వేడుక సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చింది. బేటీ బచావో– బేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాల స్ఫూర్తిని ఈ కుటుంబం ఆచరణలో చూపించింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “ఆడపిల్ల అంటే భారంగా కాదు, ఇంటి అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. భవిష్యత్తులో ఆడపిల్లల విద్య, అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే

టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..

ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?