టైరు పంక్చర్‌ అయి బోల్తాపడ్డ రిక్షా.. డబ్బాలు, బాటిళ్ళతో ఎగబడిన జనం

Updated on: Jul 11, 2026 | 4:21 PM

సూర్యాపేట జిల్లా కోదాడలో వంటనూనె డబ్బాలు తీసుకెళ్తున్న రిక్షా బోల్తా పడటంతో వందల లీటర్ల నూనె రోడ్డుపై పారిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఖాళీ బాటిళ్లు, డబ్బాలు తీసుకుని నూనె సేకరించేందుకు పోటీపడ్డారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, రోడ్డుపై నూనె జారుడు ప్రమాదం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

రోడ్డుపైన కూరగాయలు, పండ్లు, లేదా మద్యం బాటిళ్లతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడితే వాటికోసం జనం ఎగబడటం మనం చూశాం. కానీ, రోడ్డుపై వంటనూనె వరదలా పారితే జనం ఖాళీ బాటిళ్లు, డబ్బాలు పట్టుకుని పరుగులు తీసిన ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. ఫ్రీ ఆయిల్ కోసం స్థానికులు పోటీ పడటంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సంతోషిమాత ఆయిల్ డిపో నుండి ప్రతిరోజు వివిధ దుకాణాలకు వంటనూనె సరఫరా చేస్తుంటారు. ఎప్పటిలాగే ఓ రిక్షా కార్మికుడు 20 వంటనూనె డబ్బాలను లోడ్ చేసుకుని మార్కెట్‌కు బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ఒక్కసారిగా రిక్షా టైరు పంక్చర్ కావడంతో రిక్షా అదుపుతప్పి బోల్తా పడింది. డబ్బాలు కిందపడి పగిలిపోవడంతో, వందల లీటర్ల వంటనూనె రోడ్డంతా చేరి వరదలా పారింది. రోడ్డుపై వంటనూనె పారుతుండటాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఇళ్లలో ఉన్న ఖాళీ బాటిళ్లు, ప్లాస్టిక్ డబ్బాలు, చివరకు డస్టర్లను తెచ్చి రోడ్డుపై ఉన్న నూనెను ఒత్తి తమ పాత్రల్లో నింపుకున్నారు. విషయం తెలిసిన ఆయిల్ డిపో యజమాని తన గుమస్తాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన నూనెను డబ్బాల్లోకి ఎక్కించారు. రోడ్డుపై నూనె నిలిచిపోవడంతో వాహనదారులు జారిపడకుండా కాసేపు రాకపోకలను నియంత్రించారు. ఈ ‘ఆయిల్’ పరుగుల వీడియో ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..

బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..

Amarnath Ice Lingam: అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!

అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు

ఏంటి? పవన్‌ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

Follow Us