నువ్వేం చేయాలో నీకు తెలుసు.. బై శిక్షణ ఇస్తూ.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్
అర్జెంటీనాలో శిక్షణ విమానంలో ఇన్‌స్ట్రక్టర్ గాల్లోనే విమానం నుంచి దూకడంతో సంచలనం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల్లో ట్రైనీ పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి గ్రౌండ్ సిబ్బంది సూచనలతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, ట్రైనీ పైలట్ ధైర్యసాహసాలను ప్రశంసించారు.
విమానం గాల్లో ఎగురుతుంటే పైలట్‌కు ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి విమానం నుంచి కిందకు దూకేసారు ఆ ఇన్‌స్ట్రక్టర్. ఊహించని ఈ పరిణామానికి పైలట్ షాకయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసింది. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. కార్డోబా ప్రావిన్స్‌లోని టోలెడో సమీపంలో గత శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. ‘ఫ్లయింగ్ ప్యారెట్ కార్డోబా’ ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన 42 ఏళ్ల ఇన్‌స్ట్రక్టర్ లియాండ్రో ఆండ్రెస్ బెర్టాజో, 22 ఏళ్ల యువతి రోసారియోకి.. సెస్నా 150 విమానంలో శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో “నువ్వేం చేయాలో నీకు తెలుసు, కానివ్వు” అని రోసారియోతో చెప్పిన వెంటనే.. ఇన్‌స్ట్రక్టర్ బెర్టాజో, తన హెడ్‌సెట్, సీట్‌బెల్ట్ తొలగించి పక్కనపెట్టి, విమానం తలుపులు తెరిచి కిందకు దూకేశాడు. ఈ అనూహ్య పరిణామంతో రోసారియో తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, వెంటనే తేరుకుని ధైర్యం కూడగట్టుకుంది. గ్రౌండ్ సిబ్బంది సూచనలను పాటిస్తూ కరోనల్ ఓల్మెడో విమానాశ్రయంలో విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేసింది. ఫ్లయింగ్ స్కూల్ డైరెక్టర్ ఎడ్వర్డో అల్వారెజ్ ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనకు ముందు బెర్టాజో మరో శిక్షణ విమానాన్ని నడిపారని, అప్పుడు ఆయనలో ఎలాంటి అసాధారణ మార్పులు కనిపించలేదని తెలిపారు. “అతడు ఎంతో మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ విషాదకర నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు బెర్టాజో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అతడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రైనీ పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించిందని అధికారులు ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..
అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!
వామ్మో… ఈ శునకం ట్యాలెంట్ మామలుగా లేదు!
సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్.. ఎంతవరకు నిజం?
