నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ.. లక్షల్లో నగదు, గోల్డ్ కొట్టేసిన కేటుగాడు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘సాత్విక్’, ‘రిత్విక్’ పేర్లతో పరిచయమైన నిందితుడు ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షల నగదు, ఒక తులం బంగారం కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ టెక్నాలజీ సహాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా అమాయక యువతులను టార్గెట్ చేస్తూ, ప్రేమ-పెళ్లి పేరుతో బురిడీ కొట్టిస్తున్న ఒక కిలాడీ గాడిని మెదక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్న ఈ కేటుగాడి వ్యవహారం స్థానికంగా సంచలనం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లంపల్లికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాత్విక్’, ‘రిత్విక్’ అనే ఆకర్షణీయమైన పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేశాడు. ఆ ప్రొఫైల్స్ చూసి ఇద్దరు యువతులు పరిచయమయ్యారు. ఇంకేముంది.. తీయ తీయని మాటల వల విసిరి ప్రేమ, పెళ్లి పేరుతో వారిని పూర్తిగా నమ్మించాడు. లవ్ ట్రాప్‌లోకి దించిన తర్వాత తన అవసరాలంటూ సదరు యువతుల నుంచి విడతల వారీగా ఏకంగా రూ.12 లక్షల నగదుతో పాటు ఒక తులం బంగారాన్ని నొక్కేశాడు. తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు మెదక్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ టెక్నాలజీ సాయంతో నిందితుడి గుట్టు తెలుసుకుని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే గుర్తుతెలియని వ్యక్తులను, ముఖ్యంగా ఫేక్ ప్రొఫైల్స్, ఫోటోలను చూసి బ్లైండ్‌గా నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
భార్యను వీపుపై మోసుకుని కలెక్టరేట్‌కు.. 10 ఏళ్లుగా న్యాయం కోసం కుటుంబం పోరాటం
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్ వచ్చినా ప్రమాదమే!
