Sister harassment: సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. విసిగిపోయిన చెల్లెలు ఏం చేసిందంటే.. వీడియో.

Updated on: Feb 03, 2023 | 9:58 AM

సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. యువత దారి తప్పుతోంది. ఇంటర్నెట్ జనరేషన్‌లో విశృంఖలత పెరిగిపోయింది. కుటుంబ బంధాలు కనుమరుగు అవుతున్నాయి. ముఖ్యంగా లైంగిక నేరాలు రోజురోజుకు..


సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. యువత దారి తప్పుతోంది. ఇంటర్నెట్ జనరేషన్‌లో విశృంఖలత పెరిగిపోయింది. కుటుంబ బంధాలు కనుమరుగు అవుతున్నాయి. ముఖ్యంగా లైంగిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు వావి వరసలు లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుల గురించి విన్నాం..చూశాం. ఇప్పుడు కనీసం చెప్పలేని రీతిలో సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నివ్వెరపాటుకు గురి చేసింది. వేధింపులు తట్టుకోలేక చెల్లి పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్ర పుణె జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల అక్క..ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయి. ఆమెకు మంచి సంబంధం చూసి వివాహం చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆమె విమానగర్‌ ప్రాంతంలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. కాగా 18 ఏళ్ల చెల్లి.. కొద్ది రోజులుగా అక్క ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో జనవరి 23న చెల్లి హాలులో పడుకుని ఉండగా.. సోదరి అక్కడకు వచ్చి తప్పుగా ప్రవర్తించింది. చెల్లిని లైంగికంగా వేధింపులకు గురి చేసింది. ఇది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా ఆమె పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. అక్కపై కంప్లైంట్ చేసింది. సెన్సిటివ్ కేసు కావడంతో ఇన్‌స్పెక్టర్ స్థాయి మహిళా అధికారిణితో విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Loading...
Unable to load recommendations.
Follow Us