ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది

Updated on: Jun 03, 2026 | 4:25 PM

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో కేటరింగ్ సిబ్బంది రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఘటనపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పందించి ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసింది. టాయిలెట్‌లో పాత్రలు శుభ్రం చేయడం వల్ల ఆహారం కలుషితమై ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

రైల్వే కేటరింగ్ సేవలలో ప్రయాణికుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేసిన ఒక ఘోరమైన నిర్వాకం వెలుగుచూసింది. లగ్జరీ ప్రయాణంగా భావించే దురంతో ఎక్స్‌ప్రెస్‌లో… ఏకంగా రైలు టాయిలెట్లో భోజన పాత్రలను కడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (FSSAI) రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ కి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది. ముంబై నుండి ఎర్నాకుళం వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. కేటరింగ్ సిబ్బంది ఒకరు రైలు టాయిలెట్ లోపల ఉండి ప్రయాణికులకు భోజనం వడ్డించే గిన్నెలు, స్పూన్లను సింకులో కడుగుతూ దొరికిపోయాడు. ఆ టాయిలెట్ నేలపైనే భోజన పాత్రల బాస్కెట్ కూడా ఉంది. దీనిని గమనించిన ఓ ప్రయాణికుడు వీడియో తీస్తూ నిలదీయగా.. “సాధారణంగా పాత్రలు కడిగేవారు అక్కడే కడుగుతారు” అంటూ బయట ఉన్న కేటరింగ్ అటెండెంట్ అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చాడు. వేల రూపాయలు చెల్లించి ప్రయాణించే తమకు ఇలాంటి మురికి కూపంలో కడిగిన పాత్రల్లో భోజనం పెడతారా అని నెటిజన్లు రైల్వే శాఖపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. టాయిలెట్‌లో పాత్రలు కడగడం వల్ల ఆహారం కలుషితమై ప్రయాణికుల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొంది. ఆహార వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రతి దశలోనూ పరిశుభ్రతను పాటించాలని గుర్తుచేస్తూ, దీనిపై సాధ్యమైనంత త్వరగా వివరణ ఇవ్వాలని ఐఆర్‌సీటీసీని ఆదేశించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌

AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. రెహమాన్

Janhvi Kapoor: దీపికాకు జాన్వీ సాలిడ్ కౌంటర్.. టాలీవుడ్‌ గురించి వాగితే ఇట్లే ఉంటది!

Satyadev: ‘రాజకీయాల గురించి మాట్లాడితే సినిమాకే పెద్ద నష్టం! నోరు మూసుకోవడం బెటర్!

24 గంటల్లో 47,460 మొక్కలు!.. ప్రకృతి కోసం గిన్నిస్ రికార్డు సృష్టించిన పర్యావరణ యోధుడు

Follow Us