పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ

Updated on: May 07, 2026 | 7:23 PM

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించగా, కలితా మాఝీ విజయం హైలైట్‌గా నిలిచింది. నెలకు రూ.2,500 సంపాదించే గృహ కార్మికురాలిగా జీవనం సాగించిన ఆమె, ఎటువంటి రాజకీయ నేపథ్యం, ఆర్థిక వనరులు లేకుండానే టీఎంసీ అభ్యర్థిపై 12 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. బూత్ స్థాయి నుంచి ప్రారంభమైన ఆమె రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. టీఎంసీ నేత మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టింది. 15 సంవత్సరాల తృణమూల్ పాలనకు చరమగీతం పాడింది. ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదయ్యాయి. అందులో బీజేపీ నాయకురాలు కలితా మాఝీ విజయం ఒకటి. ఎందుకంటే ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ నెలకు కొద్దిపాటి జీతంతో జీవనం సాగిస్తున్న కలితా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఎంసీ అభ్యర్థిపై 12 వేలకుపైగా ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. గుస్కారా మున్సిపాలిటీకి చెందిన కలితా మాఝీకి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదా వారసత్వం లేదు. ఎన్నికల్లో పోటీకి ఆమె దగ్గర తగిన ఆర్థిక వనరులు కూడా లేవు. క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు కలిత నాలుగిళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ నెలకు కేవలం రూ.2,500 సంపాదించేవారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకునేవారు. అటువంటి కలితా మాఝీకి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. కలిత సాధారణ జీవిత నేపథ్యం, స్థానికంగా ఉన్న బలమైన సంబంధాల కారణంగా ఎన్నికల ప్రచార సమయంలో ఆమె అభ్యర్థిత్వం అందరి దృష్టిని ఆకర్షించింది. కలితా మాఝీకి ఈ విజయం అంత ఈజీగా రాలేదు. ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను స్వయంగా కలిసేందుకు ఇంటింటికీ తిరిగారు. కఠోరంగా శ్రమించారు. నేరుగా ఓటర్లతో మమేకయ్యారు. ఆ శ్రమ ఫలించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం గానీ, ఆర్థిక అండ గానీ లేని కలితా మాఝీ ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. కలిత పదేళ్ల నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని బూత్ స్థాయి కార్యకర్తగా ప్రారంభించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్‌.. సజ్జనార్‌ రియాక్షన్‌

పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..

గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ.. భారీగా సిలిండర్లు మాయం..

అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!

మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..

Follow Us