Dog riding: హార్స్‌ రైడర్స్‌కి సవాలు చేస్తున్న కుక్కపిల్ల.. నగర రోడ్లపై గుర్రంపై దూసుకుపోతున్న డాగీ..

|

Jul 21, 2022 | 9:51 AM

హార్స్ రైడింగ్‌ మీరే కాదు.. మేమూ చేస్తామంటూ సవాలు విసురుతోంది ఓ కుక్కపిల్ల. అంతేకాదు.. గుర్రమెక్కి నగర రోడ్లపై కౌబాయ్‌లా దూసుకుపోయింది కూడా.


హార్స్ రైడింగ్‌ మీరే కాదు.. మేమూ చేస్తామంటూ సవాలు విసురుతోంది ఓ కుక్కపిల్ల. అంతేకాదు.. గుర్రమెక్కి నగర రోడ్లపై కౌబాయ్‌లా దూసుకుపోయింది కూడా. ఈ అసాధారణ దృశ్యం నెటిజన్లకు కెనడియన్ టీవీ సిరీస్ ప్రముఖ కార్టూన్ పా పెట్రోల్‌ను గుర్తు చేసింది. అదే సమయంలో దీనిని ఇండియ‌న్ నెటిజ‌న్లు మ‌జ్నూభాయ్ సినిమాలో హీరో అనిల్‌క‌పూర్ గీసిన గుర్రంపై గాడిద పెయింటింగ్‌తో పోల్చారు. ప్రస్తుతం ఈ గుర్రపు స్వారీ చేస్తున్న కుక్కపిల్ల వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతుంది.ఈ వీడియోను ట్విట‌ర్‌లో అప్‌లోడ్ చేశారు. న‌గ‌ర రోడ్లపై ప‌రుగెత్తుతున్న గుర్రంపై కుక్కపిల్ల ద‌ర్జాగా నిల్చుని ఉంటుంది. సిగ్నల్ ప‌డిన‌ప్పుడు అవి ఆగిపోయాయి. గ్రీన్‌లైట్ ప‌డ‌గానే గుర్రం మ‌ళ్లీ ప‌రుగెత్తడం ప్రారంభించింది. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తుండగా వేలల్లో లైక్‌ చేస్తున్నారు. అంతేకాదు తమదైన శైలిలో కామెంట్లతో హోరిత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 21, 2022 09:51 AM