Viral Video: దొంగను పట్టించిన దోమ..! చైనాలో ఆశ్చర్యకర ఘటన.. వీడియో చుస్తే మీరే ఆశ్చర్యపోతారు..

|

Jul 24, 2022 | 8:01 AM

చైనాలో ఓ దొంగను దోమలు పట్టించాయి. వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఫూజియాన్‌ ప్రావిన్స్‌లో ఓ దొంగ ఇటీవల ఎవరూ లేని అపార్ట్‌మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.


చైనాలో ఓ దొంగను దోమలు పట్టించాయి. వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఫూజియాన్‌ ప్రావిన్స్‌లో ఓ దొంగ ఇటీవల ఎవరూ లేని అపార్ట్‌మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే బాగా ఆకలితో ఉండటంతో ముందుగా వంటింట్లోకి వెళ్లాడు. కోడిగుడ్లు, నూడుల్స్‌తో ఎగ్‌ న్యూడుల్స్‌ చేసుకొని లాగించేశాడు.ఆ తర్వాత కాసేపు కునుకుతీద్దామని మంచంపై వాలాడు. కానీ ఇల్లంతా దోమలమయం కావడంతో అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న ఓ మస్కిటో కాయిల్‌ వెలిగించాడు. అయినా కూడా దోమలు కుడుతుండటంతో కొన్నిటిని టపీటపీమంటూ చంపేశాడు. తెల్లవారుజాము దాకా ఇంట్లోనే ఉండి అందినకాడికి దోచుకెళ్లాడు. దొంగతనం ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు ఇంటినంతా క్షుణ్ణంగా పరిశీలించారు.దోమలు గోడపై రక్తపు మరకలతో అతుక్కుపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. డీఎన్‌ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం .. చాయ్‌ .. అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకున్న అతను ఆ ప్రాంతంలో మరో మూడు దొంగతనాలు కూడా చేసినట్లు వెల్లడించాడు. దీంతో చాయ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on