అరుదైన బావురుపిల్లిని చూసారా ?? అంతరించిపోతున్న ఈ జంతువును మీరు ఒక లుక్ వేయండి

Updated on: Feb 07, 2026 | 9:30 AM

"బావురుపిల్లి" లేదా "ఫిషింగ్ క్యాట్" అంతరించిపోతున్న అరుదైన జాతి. ఈ జల వేటగాడు మడ అడవులు, చిత్తడి నేలల్లో నివసిస్తూ చేపలను వేటాడుతాడు. చేపల గుడ్లు తినే చేపలను నియంత్రిస్తూ జీవవైవిధ్యానికి దోహదపడతాడు. కోనసీమ, ఏలూరు వంటి ప్రాంతాల్లో గుర్తించారు. దీని ప్రాముఖ్యత తెలియక కొన్నిసార్లు మనుషులచే వేటపాలవుతుంది. దీని సంరక్షణ అత్యవసరం.

పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు కొందరు కానీ చాలా మంది పిల్లిని పెంచుకుని దానికోసం తమ ఆస్తులు సైతం రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకు రొటీన్ గా ఇళ్లమధ్య తిరుగుతూ కనిపించే పిల్లికి అడవుల్లో కని పించే పిల్లికి చాలా తేడా ఉంటుంది. అదే వాడుక భాషలో మన్నప్రాంతంలో బావురుపిల్లి అంటారు. ఇది నీటిలో ఈదుతూ చేపలను వేటాడుతుంది. అందుకే ఈ బావురుపిల్లిని “ఫిషింగ్ క్యాట్” అని పిలుస్తారు. చిత్తడి నేలలు , ముఖ్యంగా మడ అడవుల్లో ఎక్కువగా వీటిసంచారం ఉంటుంది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల్లో ఈ బావురుపిల్లి కూడా ఉంది. చేపలు పెట్టె గుడ్లను మరికొన్ని రకాల చేపలు తినేస్తుంటాయి. అయితే అలాంటి చేపల్ని ఈ బావురు పిల్లులు తినటం వల్ల జీవ వైవిధ్యానికి ఈ పిల్లులు దోహద పడుతుంటాయి. అందుకే వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇక అంబెడ్కర్ కోనసీమ జిల్లా లోని కోరింగ ఫారెస్ట్ లో ఈ బావురు పిల్లి ని గుర్తించారు. ఏలూరు ఏజెన్సీలో ఏం జరిగిందంటే …ఏజెన్సీ ప్రాంతమైన కుక్కునూరు ప్రాంతం లో స్థానికులకు ఈ బావురుపిల్లి భయం పట్టుకుంది. ఇది రాత్రి పూట తిరుగుతూ అదును చూసి పెంపుడు కోళ్లను ఎత్తుకు వెళ్లి తింటోంది. దీంతో ఊరిలో ఉన్న స్థానికులకు కోళ్లు ఏమైపోతున్నాయనే ఆందోళన మొదలైంది. కుక్కుననూరు మండలం మర్రి పాడు గ్రామంలో రోజు ఈ పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులందరూ కలిసి ఒక వల ఏర్పాటు చేసారు. అందులో అడవి పిల్లి పడింది. అయితే వారికి దాని ప్రాధాన్యత తెలియక దాన్ని కొట్టి చంపేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి