భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
నార్వేలోని ప్రఖ్యాత E-69 హైవేను 'భూమి చివరి రోడ్డు'గా పరిగణిస్తారు. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న ఈ 129 కి.మీ. మార్గం తీవ్రమైన వాతావరణం, చలి, బలమైన గాలులతో కూడుకుని ఉంటుంది. ఒంటరిగా ప్రయాణం నిషేధం. ఇక్కడ భూమి అంచున నిలిచిన అనుభూతిని పొందవచ్చు. పర్యాటకులు శీతాకాలంలో అరోరా (ఉత్తర ధ్రువ కాంతులు) అద్భుతాలను చూసే అవకాశం పొందుతారు, ఇది ఒక ప్రత్యేకమైన పర్యాటక ఆకర్షణ.
భూమి ఎక్కడ అంతమవుతుంది.. భూమిపై చివరి రోడ్డు ఎక్కడ ఉంది.. ఆ తరువాత ఏముంది అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. జియాలజిస్టులు నిశ్చయించిన రోడ్డు నార్వే దేశంలో ఉంది.. అక్కడ భూమి.. ఆకాశం రెండూ కలుస్తాయట .. ఇక్కడితో ప్రపంచ రహదారి ముగింపునకు వస్తుంది. నార్వేలోని ‘E-69 హైవేను చూడడానికి చాలా మంది అక్కడకి వెళుతుంటారు. భూమి చివరి అంచుపై ఒక్కసారైన నడవాలని ఇష్టపడుతున్నారు. ఈ రోడ్డు ముగిసిన చోట భూమి ,… ఆకాశం రెండూ కలుస్తాయనీ చెబుతారు. భూమి అంచు ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే భూమధ్య రేఖకు ఎగువన ఉంటుంది. నార్వే దేశంలోని E-69 హైవే ఉత్తర ధ్రువం వద్దకు వెళ్తుంది. ఈ రోడ్డు ఉత్తర ఐరోపాలోని నార్డ్‌కాప్‌ను నార్వేలోని ఓల్డాఫెవోఓర్డ్ గ్రామంతో కలుపుతుంది. ఈ రహదారి పొడవు 129 కిలోమీటర్లు. ఈ మార్గం ఐదు సొరంగాల గుండా వెళ్తుంది. వీటిలో పొడవైన సొరంగం నార్త్‌కేప్. దీని పొడవు 6.9 కిలోమీటర్లు. ఇది సముద్రమట్టానికి 212 మీటర్ల దిగువకు ఉంటుంది. దీనినే చివరి రహదారిగా పిలుస్తున్నారు. భూమి చివరి రోడ్డుపై వెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఈ-69 హైవే’లో ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు.ఇక్కడ గాలి భయంకరమైన వేగంతో వీస్తుందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా చలి కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట. వేసవిలో కూడా ఇక్కడ మంచు కురుస్తుందట. శీతాకాలంలో ఈ రోడ్డు మంచుతో కప్పబడి ఉంటుంది. రోడ్డు మూసుకుపోయింది. 1930లో ‘E-69 హైవే’ని నార్వేలో నిర్మించాలని నిర్ణయించారు శాస్త్రవేత్తలు. 1934లో రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఈ పొడవైన రోడ్డు నిర్మాణానికి 62 ఏళ్లు పట్టింది. 1992లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రపంచ పర్యాటకుల రాకతో స్థానికుల ఆదాయం పెరిగింది. ఈ రోడ్డుపై ఎన్ని కండీషన్లు ఉన్నా… రోజూ చాలా మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తుంటారు. ఎందుకంటే… భూమి ఉత్తర ధ్రువంపై కాలు పెట్టడం ఎలాగూ వీలు పడదు. కనీసం ఈ రోడ్డు చివరి దాకానైనా వెళ్లి… ఉత్తర ధ్రువం వైపు వెళ్లిన ఫీల్ పొందవచ్చని భావిస్తున్నారు పర్యాటకులు. చలికాలంలో ఇక్కడికి వెళ్లేవారికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. వారికి అరోరాలు కనిపిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలులు ఆకాశంలో గ్రీన్, పింక్ కలర్స్ లో కనిపిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
A. R. Rahman: 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
