రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో కదులుతూ కనిపించిన

Updated on: Aug 26, 2026 | 3:41 PM

గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. శాండ్‌విచ్ తింటుండగా అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. రెస్టారెంట్‌లలో ఆహార భద్రత, పరిశుభ్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

చాలా మందికి శాండ్‌విచ్‌లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు వాటిని ఎంతో ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో డెకరేషన్, టేబుల్స్ ఉన్నంత శుభ్రంగా ఫుడ్ ఉండదనే వాదనకు గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనే తాజా ఉదాహరణ. గురుగ్రామ్‌లోని ప్రసిద్ధ పాల్ రెస్టారెంట్‌కు వెళ్ళిన ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశారు. రకరకాల వంటకాలతో పాటు శాండ్‌విచ్‌ను కూడా సగం వరకు తిన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కంటపడిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది. శాండ్‌విచ్ లోపల తెల్లటి రంగులో ఉన్న ఒక చిన్న పురుగు ప్రాణంతో కదులుతూ కనిపించింది. ఆహారంలో పురుగును చూసి ఒక్కసారిగా కంగుతిన్న కస్టమర్ వెంటనే తేరుకుని, ఆ దృశ్యాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.క్షణాల్లోనే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లగ్జరీ హోటళ్లలో పరిశుభ్రత ఇలాగేనా ఉండేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Published on: Aug 26, 2026 02:22 PM
Loading...
Unable to load recommendations.
Follow Us