వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

Updated on: May 09, 2026 | 12:34 PM

మండే ఎండల్లో ఇంటిని చల్లగా ఉంచేందుకు జైపూర్ కుటుంబాలు అద్భుత పరిష్కారం కనుగొన్నాయి. ఏసీలు, కూలర్లు లేకుండానే ఇంటి పైకప్పుపై కూరగాయల మొక్కలు పెంచి రూఫ్‌టాప్ గార్డెనింగ్ ద్వారా లోపలి వేడిని 50% తగ్గించారు. తక్కువ ఖర్చుతో, కరెంట్ బిల్లులు లేకుండా, పర్యావరణ అనుకూల పద్ధతిలో ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చని నిరూపించారు.

ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగలకు తట్టుకోలేక కొందరు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడుతుంటే.. అవి వాడే స్థోమత, ఇంట్రెస్ట్‌ లేనివారు, తమ ఇంటి మిద్దెను గోనె సంచులతో, వరిగడ్డితో, తాటి కమ్మలతో కప్పడం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం 4000 కుటుంబాలు ఇవేవీ చేయకుండానే తమ ఇళ్లను చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చేసుకున్నారు. ఇది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏసీలు వాడితే చల్లగా ఉంటుందేమో కానీ నిర్వహణ ఖర్చు ఎక్కువే. కూలర్లు, ఫ్యాన్లు వాడినా కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతాయి. అలాంటి ఇబ్బందులేవీ లేని అద్భుత ఆలోచనకు తెరతీశారు జైపూర్ వాసులు. ఇంటి లోపలి వేడిని తగ్గించడానికి ఒక సింపుల్ రూఫ్‌టాప్ మోడిఫికేషన్‌ చేసారు. ఇంటి పైకప్పులో కూరగాయల మొక్కలు, తీగలను పెంచడం ద్వారా గ్రీన్ స్పేస్‌గా, రూఫ్‌టాప్ గార్డెనింగ్‌గా మార్చేశారు. దీంతో ఇంటి టెంపరేచర్‌ను 50% వరకు తగ్గించగలిగారు. అంటే ఎటువంటి ఏసీ అవసరం లేకుండానే ఇళ్లల్లో చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. జైపూర్ వాసుల ‘చల్లని ఐడియా’ వెనుక ఓ ఆర్గానిక్ స్టార్టప్ సంస్థ ప్రోత్సాహం ఉంది. ఇంటిపై గార్డెనింగ్‌ పెంచడం ద్వారా ఇంటి అవసరాలు తీరడమే కాకుండా, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చనే స్టార్టప్ ఆలోచనను అమలు చేయడం ద్వారా ఇప్పుడు ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి. మండే ఎండల్లో కూడా ఏసీలు లేకుండా చల్లటి గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాయి. రూఫ్‌టాప్ గార్డెనింగ్ వల్ల చల్లదనం మాత్రమే కాకుండా కూరగాయలు పండించడం, వర్షపు నీటిని నిల్వచేయడం వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పైగా ఇది తక్కువ ఖర్చయ్యే పర్యావరణ అనుకూల ఆలోచన కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..

మతిమరుపు… గుండెజబ్బుకు సంకేతమా ?? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు !!

TVK Vijay: మేనిఫెస్టోలోని హామీలన్నీ విజయ్ తీర్చగలడా ??

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

Godari Gattupaina Review: డీసెంట్ ఎంటర్టైనర్ గోదారి గట్టుపైన రివ్యూ.. ఎలా ఉందంటే ??

Follow Us