ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు

Updated on: Feb 07, 2026 | 6:24 PM

చిత్తూరు జిల్లాలో ఓ విస్మయకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె తమకు చనిపోయినట్లేనని భావించి, బతికుండగానే కర్మకాండ నిర్వహించారు తల్లిదండ్రులు. కాణిపాకంలో వివాహం చేసుకున్న హేమప్రియ, కిషోర్‌ల తల్లిదండ్రులు గ్రామస్తులకు భోజనాలు కూడా పెట్టారు. బ్రతికి ఉన్న బిడ్డకు ఇలా చేయడం సరికాదని స్థానికులు చెప్పినా, వారు వినిపించుకోలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కన్నబిడ్డలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. పిల్లలు బాగా చదువుకోవాలని, వృద్ధిలోకి రావాలని ఎంతో కష్టపడి చదివిస్తారు. వారి కెరీర్‌ కోసం వారి సుఖసంతోషాలను సైతం త్యాగం చేస్తారు. అలాంటి పిల్లలు తప్పుదారిలో నడిచి, వారి జీవితాన్ని చేజేతులా పాడుచేసుకుంటే ఆతల్లిదండ్రుల గుండె బద్దలైపోతుంది. బాధతో గుండె ఆక్రోశిస్తుంది.. చివరికి చేసేదిలేక వారిని త్యాగం చేయాల్సి వస్తుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె చనిపోయిందని భావించి కర్మకాండ నిర్వహించారు తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లారి కుప్పంకు చెందిన ఉష, సుబ్రహ్మణ్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హరిప్రియ బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. రెండో అమ్మాయి బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ క్రమంలో రెండో కుమార్తె హేమప్రియ అదే గ్రామానికి చెందిన కిషోర్‌ అనే యువకుడి ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి.. హేమప్రియ తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో ఇంటినుంచి వెళ్లిపోయిన హేమప్రియ, కిషోర్‌ ఫిబ్రవరి 4న కాణిపాకం ఆలయంలో వివాహం చేసుకున్నారు. దాంతో తమను కాదని వెళ్లి పెళ్లి చేసుకున్న కుమార్తె చనిపోయినవారితో సమానం అంటూ ఆ తల్లిదండ్రులు కర్మకాండ జరిపించారు. గ్రామస్తులందరికీ భోజనాలు కూడా పెట్టారు. అయితే బ్రతికి ఉన్న కూతురికి ఇలా కర్మకాండ చేయడం సరికాదని స్థానికులు, గ్రామస్తులు నచ్చజెప్పినా ఆ తల్లిదండ్రులు వినలేదు. గ్రామంలోని బంధువులకు, స్థానికులకు సమాచారం ఇచ్చి భోజనాలు పెట్టిన పేరెంట్స్ కూతురు చనిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్నముద్దాడ రవిచంద్ర

చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే

మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్.. షాక్ లో అభిమానులు

నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం

వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు