Green Tea: ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్‌ టీ.. కారణం ఇదే

Updated on: Jun 12, 2026 | 4:33 PM

ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ చైనాలో లభించే ‘లాంగ్‌జింగ్’ గ్రీన్ టీ ధర వింటే ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం 500 గ్రాముల ప్రీమియం క్వాలిటీ ‘మింగ్‌కియాన్’ లాంగ్‌జింగ్ టీ ధర రూ.4 లక్షల వరకు ఉంటుంది. హాంగ్‌జౌ సమీపంలోని వెస్ట్ లేక్ ప్రాంతంలో పండే ఈ టీ తన అద్భుతమైన రుచి, సువాసన, ఆరోగ్య ప్రయోజనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

బరువు తగ్గడానికో, ఆరోగ్యం కోసమో చాలామంది ప్రతిరోజూ గ్రీన్‌ టీ తాగుతుంటారు. సాధారణంగా మనం కొనే గ్రీన్‌ టీ ప్యాకెట్ ధర వందల్లో ఉంటుంది. కానీ, చైనాలో దొరికే ఒక ప్రత్యేకమైన గ్రీన్‌ టీ ధర వింటే మాత్రం ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం అర కిలో గ్రీన్‌ టీ ధర అక్షరాలా రూ. 4 లక్షల వరకు ఉంటుందంటే నమ్ముతారా..కానీ ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన, అత్యంత ఖరీదైన ఆ గ్రీన్‌ టీ పేరే ‘లాంగ్‌జింగ్’. ఈ విలాసవంతమైన గ్రీన్‌ టీ తూర్పు చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్సులో గల హాంగ్‌జౌ పరిసరాల్లోని ‘వెస్ట్‌లేక్‌’ చుట్టూ ఉన్న కొండల్లో మాత్రమే లభిస్తుంది. 18వ శతాబ్దంలో చైనాను పాలించిన క్వియాన్‌లాంగ్‌ చక్రవర్తి హాంగ్‌జౌను సందర్శించినప్పట్నుంచీ ఈ గ్రీన్‌ టీకి అంతర్జాతీయంగా విపరీతమైన ప్రసిద్ధి లభించింది. ఈ తేయాకులను సేకరించే కాలాన్ని బట్టి దీని ధర, రుచి ఆధారపడి ఉంటాయి. మార్చి మధ్యలో సేకరించే లాంగ్‌జింగ్‌కు సువాసన, రుచి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్‌ మొదటి వారానికి ముందు సేకరించే అత్యుత్తమ శ్రేణి ఆకులను ‘మింగ్‌కియాన్‌’ అని, ఆ తర్వాత కాలంలో సేకరించే వాటిని ‘యుకియాన్‌’ అని పిలుస్తారు. ఈ క్రమంలో కేవలం 500 గ్రాముల బరువుండే ప్రీమియం క్వాలిటీ ‘మింగ్‌కియాన్‌’ ధర మార్కెట్లో సుమారు రూ. 3.8 లక్షల నుండి రూ. 4.18 లక్షల వరకు ఉంటుంది. దీని అద్భుతమైన సువాసన, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు దీనిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

Future City: ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ

Rajinikanth: సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?

ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ప్రకృతి సృష్టించిన ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

Follow Us