Viral Video: రోడ్డుపై వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడ్డు వచ్చిన గేదెలు.. పక్కకు తప్పించగా.. వీడియో

|

Jan 20, 2023 | 9:18 PM

ప్రమాదాలు ఎలాగైన సంభవించవచ్చు. గేదెలు లేదా ఇతర జంతువులు అడ్డు వచ్చినప్పుడు మనం ఎవర్నీ నిందించలేం. అందుకే పరిమిత వేగంతో వెళ్తే.. ప్రాణాలు దక్కించుకోవచ్చు.


ప్రమాదాలు ఎలాగైన సంభవించవచ్చు. గేదెలు లేదా ఇతర జంతువులు అడ్డు వచ్చినప్పుడు మనం ఎవర్నీ నిందించలేం. అందుకే పరిమిత వేగంతో వెళ్తే.. ప్రాణాలు దక్కించుకోవచ్చు. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, వెంగన్నపేట గ్రామం పరిధిలో పెను ప్రమాదం తప్పింది. దారి వెంబడి వెళ్తోన్న ఒక కారుకు సడెన్‌గా గేదెలు అడ్డొచ్చాయి. దాంతో ఏం చేయాలో పాలు పోక.. కారును పక్కకు తప్పిచాడా డ్రైవర్. దీంతో ఆ పక్కనే ఉన్న బావిలో పడిపోయింది కారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈఘటనలో కారు డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. బావి లోతు చిన్నది కావడం.. వేగం కూడా తక్కువ కావడంతో.. తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కారును బావిలోంచి తీసే యత్నం చేస్తున్నారు స్థానికులు. బావిలో నీరు తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే నీట మునిగిపోయి నిండు ప్రాణం బలైపోయేది. రోడ్డుపై గేదెలు, ఇతర జీవాలు తోలుకెళ్లేవారికి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on