పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే
పెళ్లంటేనే సరదగా సరదాగా సాగిపోయే పండుగ. అంతేకాదు పెళ్లిలో చిన్న చిన్నగొడవలు కూడా కామన్. తగాదాలేని పెళ్లి ఉండదంటే అతిశయోక్తి కాదు. మగ పెళ్లివారు ఆడపెళ్లివారిని ఆటపట్టించడం.. మర్యాదలు, విందుభోజనం దగ్గర ఏదొక వంకతో గొడవపడటం సహజం. కానీ ఓ పెళ్లిలో విచిత్ర సంఘటన జరిగింది. ఏకంగా పెళ్లి వేదికపైనే వధూవరులు ఇండియా-పాకిస్థాన్ ఫ్యాన్స్ లా కొట్టుకున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు.. వీళ్లు వధూవరులా.. బద్దశత్రువులా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలో… వివాహ వేడక జరుగుతోంది. వధూవరులు వేదికపై నిలబడి దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత వధువుకి వరుడు స్వీట్ తినిపించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ స్వీట్ తినడానికి వధువు నిరాకరించింది. దీంతో వరుడు బలవంతంగా ఆమెకు స్వీట్ తినిపించాడు. దీంతో వధువుకు కోపం వచ్చి వరుడిని చెంప మీద కొట్టింది. దీంతో చిర్రెత్తిన వరుడు కూడా తిరిగి ఆమెను కొట్టాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఇద్దరిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. వీళ్లేంటండీబాబు.. పెళ్లి వేదికపైనే ఇలా రెచ్చిపోయారు.. ఇంతకీ పెళ్లి జరిగిందా.. ఆగిపోయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చావా సినిమా ఎఫెక్ట్ బంగారం కోసం ఆ కోట చుట్టూ తవ్వకాలు
తెల్లారితే పెళ్లి..! అంతలోనే.. పెళ్లి కుమారుడి ఆత్మహత్య