చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్.. సజ్జనార్ రియాక్షన్
హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌ను అడ్డుకున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ సాహసం అందరినీ ఆకట్టుకుంది. రౌడీ షీటర్ బారి నుండి మహిళను రక్షించి, ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ ధైర్యసాహసాలను గుర్తించిన పోలీస్ కమిషనర్ సజ్జనర్, జాహెర్‌ను ప్రత్యేకంగా సన్మానించి నగదు పురస్కారం అందజేశారు. పౌరులు ఇలా స్పందించాలని సీపీ పిలుపునిచ్చారు. జాహెర్ చర్య ఆదర్శప్రాయం.
నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. దానిని ఎదిరించడమే సగటు పౌరుడి ధర్మమని నిరూపించారు ఒక ఆటో డ్రైవర్. ప్రాణాలకు తెగించి ఒక రౌడీ షీటర్ బారి నుండి మహిళను కాపాడిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ సాహసాన్ని ఇప్పుడు అంతా అభినందిస్తున్నారు. మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ ప్రాంతంలో మంజు ఓమ్లతా అనే మహిళ తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో డబీర్‌పురకు చెందిన పాత నేరస్థుడు, రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని గొలుసును లాగడానికి ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడాన్ని అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ జాహెర్ గమనించారు. సంఘటన స్థలాన్ని దాటి 100 మీటర్లు ముందుకు వెళ్లినప్పటికీ, జాహెర్ క్షణాల్లో స్పందించి తన ఆటోను రివర్స్ చేసి వేగంగా అక్కడికి చేరుకున్నారు. పారిపోతున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి కిందపడేశాడు. నిందితుడు కర్రతో దాడి చేసినా బెదరకుండా జాహెర్ ప్రతిఘటించారు. అదే సమయంలో గస్తీ పోలీసులు రావడంతో నిందితుడు చిక్కాడు. అయితే, జాహెర్ తన పని ముగించుకుని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ అసామాన్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని తన ఆఫీస్ ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. ప్రతి పౌరుడు ఇలాగే స్పందిస్తే నేరస్థులకు భయం పుడుతుంది” అని సీపీ ప్రశంసించారు. నిందితుడైన రౌడీ షీటర్ పై ఇప్పటికే 16 కేసులు ఉండటం గమనార్హం. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన జాహెర్‌పై నగరవాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..
గ్యాస్ గోడౌన్‌లో చోరీ.. భారీగా సిలిండర్లు మాయం..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు
