Big Spider Video: బాబోయ్ ఎంతపెద్ద సాలీడో..కరిస్తే ఖతమేనట..! కానీ దీని వెనుకో ఇంకో కథ.. (వీడియో)

విపరీతమైన సోషల్‌ మీడియా వాడకంతో వింత వింత ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ఫొటోలు మ‌న కండ్ల‌ను కూడా న‌మ్మ‌లేనంత విచిత్రంగా ఉంటాయి.ఇలాంటివి కూడా ఉంటాయా అని మ‌నం వాటిని చూసిన త‌ర్వాత ఆశ్చ‌ర్య‌పోక తప్పదు..

Big Spider Video: బాబోయ్ ఎంతపెద్ద సాలీడో..కరిస్తే ఖతమేనట..! కానీ దీని వెనుకో ఇంకో కథ.. (వీడియో)

|

Updated on: Oct 22, 2021 | 7:25 AM

విపరీతమైన సోషల్‌ మీడియా వాడకంతో వింత వింత ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ఫొటోలు మ‌న కండ్ల‌ను కూడా న‌మ్మ‌లేనంత విచిత్రంగా ఉంటాయి.ఇలాంటివి కూడా ఉంటాయా అని మ‌నం వాటిని చూసిన త‌ర్వాత ఆశ్చ‌ర్య‌పోక తప్పదు..కొంద‌రు అయితే ఇలాంటి ఫొటోల‌తోనే ప్ర‌పంచ రికార్డులు కూడా క్రియేట్ చేస్తుంటారు. ఇక పోతే ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఓ ఫొటోతోనే ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. ఆయ‌న తీసిన ఫొటో చూస్తే అంద‌రూ షాక్ అయిపోవాల్సిందే.

బ్రెజిల్ దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ గిల్ విజెన్ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. ఆయ‌న‌కు ఓ రోజు అనుకోకుండా త‌న బెడ్ రూమ్ లో చిన్న చిన్న సాలెపురుగులు విప‌రీతంగా కనిపించాయట..ఏంటా అని ఒక్క‌సారి మంచం కింద‌కు చూస్తే..అక్క‌డ క‌నిపించిన దాన్ని చూసి షాక్ అయ్యాడు..త‌న మంచం కింద వంద‌ల సంఖ్య‌లో చిన్న సాలె పురుగులు ఉండ‌టంతో పాటుగా వాటి ప‌క్క‌నే త‌న అర చేతి అంత పెద్ద‌గా ఉన్న ఓ సాలెపురుగును గుర్తించాడు. అది ఈ ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన‌దిగా ఆయ‌న తెలుసుకున్నాడు. అది గ‌న‌క కుడితే ప్రాణాలు పోతాయట..వంద‌ల సంఖ్య‌లో అది పిల్ల‌ల్ని పెట్టి వాటి ప‌క్క‌నే హాయిగా రెస్ట్ తీసుకుంటోంది. ఇంకేముంది ఆయ‌న దాన్ని కాస్తా క్లిక్ మ‌నిపించేశాడు. ఇంకేముంది అత‌గాడు ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేయ‌గా తెగ వైరల్‌గా మారింది.. ఏకంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది..ఆయ‌న తీసిన ఫొటోకు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది. 
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Devaragattu Bunny Festival: కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. ఏ మాత్రం తగ్గని బన్ని ఉత్సవాల్లో హింస.. (వీడియో)

Follow us