Viral Video: కారు ఎక్కబోయిన మహిళ.. ఒక్కసారిగా భయంతో పరుగులు.. అసలు ఏమైందంటే..?? వీడియో
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలో సర్క్యులేట్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉన్నా.. కొన్నిటిని చూసి నెటిజన్లు అవాక్కవుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలో సర్క్యులేట్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉన్నా.. కొన్నిటిని చూసి నెటిజన్లు అవాక్కవుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో కాస్త భయంగా, ఇంకాస్త ఫన్నీగా ఉంది. ఈ వీడియో చూసి కొందరు నెటిజన్లు నవ్వుకుంటుంటే.. మరికొందరు భయం ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా.. ఓ మహిళ ఇంట్లో నుంచి పళ్ల బుట్టను పట్టుకుని కారు దగ్గరకు వెళ్లింది. కారు ఎక్కుదామని డోర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాకయింది. కారులో నల్లటి భారీ శరీరం కలిగిన ఎలుగుబంటి ఒకటి కూర్చుని ఉంది. వెంటనే భయంతో పెద్ద పెట్టున కేకలు పెట్టింది. ఏం చేయాలో తెలియక తెరిచిన కార్ డోర్‌ను క్లోజ్ చేయడానికి ట్రైచేసింది. వెంటనే ఎలుగు బంటి రియాక్టవడంతో చేతిలో పళ్ల బుట్టను కింద పడేసి పెద్దగా అరుస్తూ ఇంట్లోకి పరుగులు తీసింది. మహిళ అరుపులతో ఎలుగుబంటి కూడా కాస్త కంగారు పడి కారులోనుంచి బయటకు వచ్చి పరగులుతీసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన.. కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో
Viral Video: 90 ఏళ్ల బామ్మ.. కారును ఓ రేంజ్‌లో నడుపుతోంది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..