Snakebite: పాము కాటుకు కొత్త మందు.! పరిష్కారం కనిపెట్టిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు..

|

Jul 30, 2024 | 8:58 PM

పాములంటే సాధారణంగా అందరికీ భయమే. ఇక పాము కాటు వేసిందంటే ప్రాణాలు పోవాల్సిందే. పాముకాటుతో ప్రపంచంలో ఏటా సుమారు లక్షన్నరమంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. సుమారు 4 లక్షలమంది పాముకాటు కారణంగా అంగవైకల్యానికి గురవుతున్నారు. ఎందుకంటే పాము కాటు వేసిన చోట చుట్టూ ఉండే కణజాలం క్షీణించి అది అంగవైకల్యానికి దారితీస్తుంది.

పాములంటే సాధారణంగా అందరికీ భయమే. ఇక పాము కాటు వేసిందంటే ప్రాణాలు పోవాల్సిందే. పాముకాటుతో ప్రపంచంలో ఏటా సుమారు లక్షన్నరమంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. సుమారు 4 లక్షలమంది పాముకాటు కారణంగా అంగవైకల్యానికి గురవుతున్నారు. ఎందుకంటే పాము కాటు వేసిన చోట చుట్టూ ఉండే కణజాలం క్షీణించి అది అంగవైకల్యానికి దారితీస్తుంది. పాముకాటుకు గురైన తర్వాత బ్రతికి బట్టకట్టినా ఇలా అంగవైకల్యంతో బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాగా ఈ సమస్యలకు ఓ పరిష్కార మార్గాన్ని ఆస్ట్రేలియా సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు.

గుండెపోటు వచ్చినప్పుడు 24 గంటల్లోపల ఇచ్చే హెపారిన్‌ మందు.. కణజాలం క్షీణతని సమర్థంగా అడ్డుకుంటోందని కనిపెట్టారు. హెపారిన్‌ రక్తం గడ్డకట్టకుండా, కణజాలం దెబ్బతినకుండా ఆపే మందు. పాము కాటుకి గురైన వెంటనే దీన్ని అందివ్వగలిగితే, కణజాలం క్షీణతనూ, దాంతోపాటూ వచ్చే వైకల్యాన్ని ఆపొచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు. అందుకే గాయమైన చోట వీలైనంత త్వరగా హెపారిన్‌ని ఇంజెక్ట్‌ చేయగలిగితే 90 శాతం వైకల్యాలని తగ్గించొచ్చని చెబుతున్నారు!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on