Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయలో త్రిశూలం ఆకారంలో ముల్లంగి దుంపలు దొరికాయి. మాలివలస గ్రామంలో రైతు జోయో పొలంలో పంట తీస్తుండగా, శివుడి త్రిశూలాన్ని పోలిన ముల్లంగి దుంపలు ఆశ్చర్యపరిచాయి. ఇది పరమశివుని మహిమగా భావిస్తున్నారు. ఈ వింత ముల్లంగి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. స్థానికులు వీటిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.
ప్రకృతి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ మండలం మాలివలస గ్రామంలో అచ్చం శివుడి ఆయుధం ‘త్రిశూలం’ ఆకారంలో ఉన్న ముల్లంగి దుంపలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గ్రామానికి చెందిన జోయో అనే రైతు తన పొలంలో ముల్లంగి పంట వేశాడు. పంట చేతికి రావడంతో దుంపలను వెలికితీస్తుండగా, ఒకే మొక్క మొదలున మూడు ముల్లంగి దుంపలు ఒకదానికొకటి అతుక్కుని ఉండటాన్ని గమనించాడు. అవి అచ్చం పరమశివుని చేతిలోని త్రిశూలాన్ని పోలి ఉండటంతో ఆ రైతు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా అటువంటి రూపంలో ఉన్న చాలా దుంపలు బయటపడటం విశేషం. సాధారణంగా ముల్లంగి దుంపలు పొడవుగా లేదా గుండ్రంగా ఉంటాయి, కానీ ఇలా మూడు పాయలుగా విడిపోయి స్పష్టమైన త్రిశూలం ఆకృతిలో కనిపించడం ఇదే మొదటిసారి అని, ఇది సాక్షాత్తూ ఆ పరమశివుని మహిమేనని రైతులు చెబుతున్నారు. ఆ రైతు ఆనందంతో ఆ వింత ముల్లంగిని గ్రామస్తులకు చూపించగా, ఆ వార్త దావానంలా వ్యాపించింది. ప్రస్తుతం ఈ ‘త్రిశూలం ముల్లంగి’ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం “హర హర మహాదేవ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కూరగాయల్లో ఇలాంటి విభిన్న ఆకారాలు అరుదుగా కనిపిస్తాయని వ్యవసాయ నిపుణులు సైతం పేర్కొంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..
ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే
ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా
Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
