శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
మంత్రి నిమ్మల రామానాయుడు మహాశివరాత్రిని స్మశానంలో జరుపుకున్నారు. ఆలయాలకు బదులుగా, ఆయన స్వయంగా స్మశానవాటికను శుభ్రం చేసి, పాలకొల్లు నియోజకవర్గంలో ఆరు స్మశానాల సుందరీకరణకు రూ. 1.25 కోట్లు కేటాయించారు. మనిషి అంతిమ మజిలీ గౌరవప్రదంగా ఉండాలని, భయం కలిగించేలా కాకుండా ఆహ్లాదకరమైన, మోడల్ స్మశానాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ వినూత్న చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.
సాధారణంగా మహాశివరాత్రివేళ దైవారాధన కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం ఈ పర్వదినాన్ని స్మశానంలో జరుపుకున్నారు. మనిషి ఆఖరి మజిలీ సాగే స్మశాన వాటికలు అస్తవ్యస్తంగా ఉండకూడదనే ఉద్దేశంతో, ఆయన స్వయంగా మరుభూమిలో శ్రమదానం చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన స్వగ్రామమైన ఆగర్తిపాలెంలో గ్రామస్తులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు స్మశాన వాటికను శుభ్రం చేశారు. కేవలం ప్రారంభించి వెళ్ళిపోకుండా.. స్వయంగా పార, గునపం పట్టి.. మట్టి గుట్టలను తొలగించారు. స్మశానంలో పేరుకుపోయిన వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని గమేళాతో మోసి చెత్త వాహనంలోకి వేశారు. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కూడా సాధారణ కార్యకర్తలా ఆయన పని చేయడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. పాలకొల్లు నియోజకవర్గంలోని ఆరు స్మశాన వాటికలను సుందరీకరించేందుకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 1.25 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన .. “మనిషి పుట్టుక ఎంత ముఖ్యమో, మరణం తర్వాత గౌరవప్రదమైన వీడ్కోలు కూడా అంతే ముఖ్యం. స్మశాన వాటికలను భయం కలిగించేలా కాకుండా, ఆహ్లాదకరంగా, సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని స్మశానాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని మోడల్ స్మశాన వాటికలుగా మారుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పండగ రోజున స్మశానాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన మంత్రి ఆలోచనా దృక్పథాన్ని పలువురు కొనియాడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన
కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు.. డార్లింగ్ బ్యూటిఫుల్ రివ్యూ..
Trisha: తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం
Prabhas: షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్
