Anant Ambani: ఈ నానీ జీతం రూ.2 లక్షలు.! అనంత్ అంబానీకి నానీగా చేసిన లలితా డిసిల్వా
ఆమె సెలెబ్రిటీల పిల్లలకు ఆయా.. ప్రస్తుత కాలంలో బిజీ బిజీ లైఫ్‌లో కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకునే సమయం తల్లిదండ్రులకు ఉండటం లేదు. ఫలితంగా చిన్నారులు కేర్ సెంటర్లు, ప్రీ స్కూళ్లలో తమ బాల్యాన్ని గడుపుతున్నారు. అచ్చమైన అమ్మప్రేమ వారికి దొరుకుతుందా అంటే చెప్పలేం.. సామాన్యుల పిల్లల పరిస్థితే ఇలా ఉంటే.. మరి సెలబ్రిటీల పిల్లల సంగతేంటి? వారికి ఓ కేర్ టేకర్‌ని నియమిస్తారు. దీనికోసం లక్షలు వెచ్చిస్తారు.
ఆమె సెలెబ్రిటీల పిల్లలకు ఆయా.. ప్రస్తుత కాలంలో బిజీ బిజీ లైఫ్‌లో కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకునే సమయం తల్లిదండ్రులకు ఉండటం లేదు. ఫలితంగా చిన్నారులు కేర్ సెంటర్లు, ప్రీ స్కూళ్లలో తమ బాల్యాన్ని గడుపుతున్నారు. అచ్చమైన అమ్మప్రేమ వారికి దొరుకుతుందా అంటే చెప్పలేం.. సామాన్యుల పిల్లల పరిస్థితే ఇలా ఉంటే.. మరి సెలబ్రిటీల పిల్లల సంగతేంటి? వారికి ఓ కేర్ టేకర్‌ని నియమిస్తారు. దీనికోసం లక్షలు వెచ్చిస్తారు. ఆ కోవకు చెందిన వ్యక్తే లలితా డిసిల్వా.. నర్సింగ్ చదివిన ఈ నానీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. వారితో గడపడం అంటే మరీ ఇష్టం.. అదే ఆమెను ఓ సెలబ్రిటీ నానీగా మార్చేసింది. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అనంత్‌ను ఆప్యాయంగా హత్తుకుని ఉన్న ఓ మహిళ ఫోటో వైరల్ అయింది.. ఆమే ఈ లలిత డిసిల్వా. ఆ ఒక్క ఫోటోతో ఆమె ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది.
ఒకప్పుడు కరీనా పిల్లలకు ఆయాగా ఉన్న ఈమె, ప్రస్తుతం ఉపాసన- రామ్‌చరణ్‌ల కూతురు క్లీంకారా బాగోగులు చూసుకుంటున్నారు. తనకు మొదట నుంచీ పిల్లలతో సమయం గడపడం అంటే ఇష్టమనీ, అదే తన అభిరుచి, జీవితం అని అంటారు డిసిల్వా. ముంబైలో పుట్టిన లలిత అక్కడే నర్సింగ్ చదువుకున్నారు. తను ఓ ఆసుపత్రిలో పిల్లల నర్సుగా పనిచేసేటప్పుడు ఆమె పని విధానాన్ని గమనించిన ఒక వ్యక్తి నానీగా చేస్తారా అని అడిగారట. అలా 1996లో నానీగా తన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదట అనంత్ అంబానీకి నానీగా చేశారు లలిత. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ కుటుంబం తనను ఎటువంటి స్థాయీ భేదాలు లేకుండా, గౌరవంగా చూసుకుంటారని తెలిపింది. పిల్లలు ముగ్గురూ ఎంతో వినమ్రంగా ఉంటారని, వాళ్లంతా తనను ప్రేమగా ‘సిస్టర్ లత’ అని పిలుస్తారని తెలిపింది. కరీనా కపూర్ పిల్లలకు కేర్‌టేకర్‌గా ఉన్నప్పుడు సెలెబ్రిటీ నానీగా తాను వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. 2016 డిసెంబర్ నుంచి గతేడాది ఆగస్టు వరకూ తైమూర్‌కు కేర్‌టేకర్‌గా ఉన్నానని తెలిపింది. ఇక, ఇటీవలే రామ్‌చరణ్, ఉపాసనల కూతురు క్లీంకారాకు కేర్‌టేకర్‌గా చేరారు. ఉపాసన, చరణ్‌లు తనతో ప్రేమగా ఉంటారని తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.